పార్లమెంట్ లో జరిగిన శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి పౌరసత్వ సవరణ చట్టం బిల్లును ఉభయసభల్లో ఆమోదించారు. అలాగే రాష్ట్రపతి కూడా ఆమోదించారు. కానీ దాని తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా మారాయి అస్సాంలో దీని  మీద అల్లర్లు చెలరేగాయి. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా హింసాకాండకు దారితీశాయి. ఇంకా ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ సమస్యపై అట్టుడుకుతోంది.

 

 ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు మరింతగా దేశ వ్యాప్తంగా విస్తరించాయి. నిన్న కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ లో కూడా చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు కాల్పుల్లో యూపీలో ఒకరు, కర్ణాటకలో ఇద్దరు మరణించారు. దేశంలో పలు చోట్ల రైలు, బస్సు రాకపోకలకు అంతరాయం కలిగింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మరీ వేల సంఖ్యలో విద్యార్థులు, విపక్ష కార్యకర్తలు రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు లాఠీలకు పని చెప్పారు.

 

తాజాగా ఢిల్లీలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఆ అంతర్జాల సేవలను స్తంభించేలా చేయాల్సిన అవసరం ఏర్పడ్డాయి. నూతన చట్టం విషయంలో అస్సలు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అధికార బీజేపీ ఇప్పటికే చెప్పేసింది. అలాగే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సి కూడా త్వరలో తీసుకువస్తామని బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డా ఢిల్లీలో ప్రకటించారు.

 

నిన్న నిరసనలు కారణంగా ఢిల్లీలోని మెట్రోలో దాదాపు 20 స్టేషన్లో మూసివేయబడ్డాయి ఆ తర్వాత సాయంత్రం వీటిని తిరిగి పునరుద్ధరించారు. అల్లర్లు జరుగుతున్న ఘటనలపై న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి, ఢిల్లీ సర్కారుకు డిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అల్లర్ల సందర్భంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. డిల్లీలో దాదాపు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీనితో సకాలంలో సిబ్బంది విధులకు చేరలేకపోయారు దీని ప్రభావంతో దాదాపు 19 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి, 16 విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: