పౌరసత్వ ఆందోళనలు దేశంలో మిన్నంటుతున్నాయి.  ఈ ఆందోళనలు ఎంతకు తగ్గడం లేదు.  శీతాకాల సమావేశాల్లో పౌరసత్వం బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం, దానికి సవరణచేర్చి పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది.  లోక్ సభ, రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టింది.  రెండు చోట్ల ఈ బిల్లు పాస్ అయ్యింది.  ఎప్పుడైతే బిల్లు చట్టసభల్లో పాస్ అయ్యి రాష్ట్రపతి బిల్లు ఆమోద ముద్ర వేసుకోవడంతో దీనిని చట్టం చేశారు.  పౌరసత్వ బిల్లును అమలు చేయడానికి అన్నిరకాలుగా అనుమతులు వచ్చాయి. 


కాగా, ఈ బిల్లుపై దేశంలో ఆందోళనలు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి.  ఈ బిల్లుపై నిరసనలు మిన్నంటడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.  సర్ధిచెప్తున్నారు.  ఎన్ని సర్ధిచెప్తున్నా, ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు.  నార్త్ వరకు పరిమితమైన ఈ ఆందోళనలు ఇప్పుడు సౌత్ కు వ్యాపించాయి.  సౌత్ లో కూడా ఆందోళనలు చేస్తున్నారు.  హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆందోళనలు జరుగుతున్నాయి.  


బెంగళూరులో టౌన్ హాల్ వద్దకు నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.  నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకొని అక్కడి నుంచి నిరసనలు తెలియజేస్తున్నారు.  ఎంతగా పోలీసులు సర్ధిచెప్పినా వినలేదు.  దీంతో పోలీస్ అధికారి వినూత్నంగా ఆలోచించాడు.  నిరసనకారులతో మాట్లాడిన తరువాత పోలీస్ ఆఫీసర్  జనగణమన అంటూ జాతీయ గీతం పాడారు.  జాతీయ గీతం పాడిన వెంటనే ఆందోళన కారులు మొత్తం నిలబడి జాతీయ గీతం పాడారు.  


జాతీయగీతం పాడిన తరువాత అక్కడి నుంచి లేచి ఆందోళనకారులు వెళ్లిపోయారు. దీంతో పోలీసులు చేసిన పనిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.  మెచ్చుకోవడమే కాకుండా ఆందోళనకారులపై ఒక్క లాఠీచార్జి చేయకుండా దేశభక్తితో వారిని అక్కడినుంచి పంపించేయడం విశేషం.  బెంగళూరు డిసిపి చేతన్ సింగ్ రాథోడ్ చేసిన ఈ పనిని సోషల్ మీడియాలో మెచ్చుకుంటున్నారు.  సోషల్ మీడియాలో ఇలాంటి న్యూస్ రావడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.  ఇలానే ప్రతి ఒక్కరు చేస్తే అల్లర్లు జరగవు కదా అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: