దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచార, హత్య కేసులో రోజు రోజుకు పెరుగుతుండటంతో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అన్ని వైపుల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి వస్తుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం దిశ చట్టం 2019 తీసుకొని వచ్చి మిగతా రాష్ట్రాల్లో కూడా ఆదర్శప్రాయంగా నిలిచింది. దీని ప్రకారం నిందితులు తప్పు చేసినట్టు తెలిసే 21 రోజుల్లో శిక్షను అమలు చేసే లాగా ఈ చట్టం రూపుదిద్దుకొంది.

 

 ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా హైకోర్టు చొరవతో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల్లో సత్వర విచారణకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూలై 25న సుమోటోగా విజయం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఈ ఆదేశాలు అనుసరిస్తూ ఆగస్టు 5వ తేదీన అన్ని రాష్ట్రాల హైకోర్టులకు కేంద్ర న్యాయశాఖ లేఖలు రాసింది. ఆ ఉత్తర్వులను అనుసరిస్తూ ఈ నెల 5న తెలంగాణ హైకోర్టు రాష్ట్ర సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ కోర్టులు ఏడాది పాటు పని చేయనున్నాయి. కరీంనగర్,ఖమ్మం జిల్లా కేంద్రాలలో రెండేసి చొప్పున ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి.

 

అలాగే మిగతా అన్ని జిల్లాల్లో ఒక్కొక్కటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కానున్నది. దిశా అత్యాచార ఘటనలో నిందితులను శిక్షించాలని అన్నివైపుల నుండి ప్రభుత్వానికి తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు. ఆ సమయంలో న్యాయ చట్టం లో కీలకమైన మార్పులు తీసుకొని రావాలని నిందితులకు వెంటనే శిక్షపడేలా చేయాలని ఎంతో మంది అభిప్రాయపడ్డారు. దిశా నిందితులు ఎన్ కౌంటర్లో అయిన సంగతి మనందరికీ తెలిసినదే.

మరింత సమాచారం తెలుసుకోండి: