తాజాగా హైదరాబాద్ లో చార్మినార్‌ వద్ద నిరసనలు చేపట్టడం జరిగింది. చార్మినార్‌ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. నేడు శుక్రవారం (డిసెంబర్ 20) మధ్యాహ్నం చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో ప్రార్థనల కోసం భారీగా  వచ్చిన ముస్లింలు.. ప్రార్థనల అనంతరం ఒక్కసారిగా రోడ్డు మీదకు దూసుకొని రావడం జరిగింది. ఇక పౌరసత్వ సవరణ చట్టం, కేంద్ర ప్రభుత్వానికి  వ్యతిరేకిస్తు   పెద్దగా   నినాదాలు చేయడం జరిగింది. దీంతో చార్మినార్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

 

ఇక బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున వేళ.. ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలకు చేపట్టకూడదు అని ప్రకటించడం జరిగింది. ఇక చార్మినార్ వద్ద అప్పటికే ఏర్పాటు చేసిన  భద్రతా బలగాలు ఆందోళనకారులను అడ్డుకోవడం జరిగింది. ఇక పెద్ద పెట్టున నిరసనకారులు  నినాదాలు చేపడుతూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముందుకు రావడం జరిగింది. దీంతో మక్కా మసీదు వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడం జరిగింది.

 

ఇది ఇలా ఉండగా  ఢిల్లీలోనూ నిరసనలు బాగా జరుగుత్తున్నాయి. జామా మ‌సీదు ఆందోళ‌న‌కారుల‌తో బయాందోళనలో వుంది. ఇక  భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఈ నిర‌స‌న‌ ర్యాలీ వద్దకు రావడంతో అక్కడ పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో చోటు చేసుకోవడం జరిగింది. మరో వైపు ఇటు హైదరాబాద్ లోకూడా  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆందోళ‌న‌ల‌పై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్   ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించడం జరిగింది. ఇక ప్రదర్శనలు  శాంతియుతంగా నిర్వహించాలి కానీ, ఇలాంటి దుందుడుకు చర్యలకు చేయకూడదు అని  ఆయన తెలియచేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: