నేను విన్నాను- నేను ఉన్నాను! ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ నినాదం ఉవ్వెత్తున ప్ర‌జ‌ల గుండెల‌ను తాకింది. వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో ఈ నినాదం ప్ర‌తి ఒక్క‌రినోటా వినిపించింది. అంతేకా దు, రావాలి జ‌గ‌న్‌-కావాలి జ‌గ‌న్ నినాదం కూడా ప‌సిపిల్ల‌ల నోళ్ల‌లోనూ వినిపించింది. ఇంత‌గా ద‌గ్గ‌రైన జ‌గ‌న్ .. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చి ఆరు మాసాలైంది. సుదీర్ఘ ప్ర‌జా ప్ర‌స్థానంలో జ‌గ‌న్ చెప్పిన మాట‌ల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. ఆయ‌న‌కు అధికారం క‌ట్ట‌బెట్టారు.

 

మ‌రి ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు ఆయ‌న న్యాయం చేస్తున్నారా?  గ‌డిచిన ఆరు మాసాల్లోనూ జ‌గ‌న్ పాల‌న‌తో ప్ర‌జ‌లు ఫిదా అయ్యారా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌ల‌కు అన్నివ‌ర్గాల నుంచి కూడా ఔను.. ఫిదా అయ్యాం!! అనే మాటే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌చార ఆర్భాటాల‌కు దూరంగా.. ప‌నిచేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక‌టి నినాదంతో ఆయ‌న ముందుకు సాగుతున్న తీరు నిజంగా న‌భూతో అంటున్నారు ప‌రిశీలకులు. ఇదే పేద‌వాడికి జ‌గ‌న్‌ను గుండె చ‌ప్పుడు చేసింద‌ని చెబుతున్నారు.

 

ప్ర‌ధానంగా ఆరోగ్య శ్రీని అన్ని వ‌ర్గాల‌కు మ‌రింత‌గా విస్త‌రించ‌డం, పింఛ‌న్ల‌ను రెట్టింపు చేయ‌డం, ప్ర‌తి ఒక్క నిరుపేద‌కు ఇల్లు క‌ల్పించ‌డం ఇలా అనేక రూపాల్లో జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప్ర‌భుత్వాన్ని పేద‌ల‌కు మ‌రింత చేరువ చేస్తోంది. ముఖ్యంగా జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో ఆయ‌న‌కు అండ‌గా నిలిచిన గ్రామీణులు కూడా ఇప్పుడు ఇదే విష‌యంపై చ‌ర్చించుకుంటున్నారు. జ‌గ‌న్ పాల‌న‌తో త‌మ‌కు పింఛ‌న్ పెరిగింద‌ని, ఆరోగ్య సేవ‌లు మ‌రిం త‌గా పెరిగాయ‌ని కూడా చ‌ర్చించుకుంటున్నారు.

 

అన్నింటికీ మించి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌ల‌ను మ‌రిం త విస్తృతం చేయ‌డం కూడా సాధ్య‌మైంద‌నే మాట వాస్త‌వ‌మ‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రికీ సంక్షేమం అందించ‌డంలోనూ ప్ర‌భుత్వం స‌క్సెస్ రేటులో ముందుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా పేద‌వాడి గుండెచ‌ప్పుడు వింటానంటూ.. ప్ర‌తిజ్ఞ చేసి మ‌రీ జ‌గ‌న్ చేస్తున్న పాల‌న‌కు మంచి మార్కులే ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: