నిత్యం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తపించే ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు ఈరోజు. గడచిన దశాబ్ద కాలంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడు పడనన్ని కష్టాలు సీఎం జగన్ పడ్డారు. లక్ష కోట్లు అవినీతి చేశాడని, జైలుకు వెళ్లాడని జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు, టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసినా ప్రజలు ఆ మాటలను లక్ష్యపెట్టలేదు. ఎవరూ ఊహించని మెజారిటీతో  జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.

 జగన్ ముఖ్యమంత్రి కాకముందు ఎవరైతే జగన్ పై విమర్శలు చేశారో నేడు వాళ్లే జగన్ పరిపాలనను మెచ్చుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్ మహబూబాబాద్ లో పర్యటనకు వెళ్లిన సమయంలో జగన్ పర్యటనను ఉద్యమకారులు అడ్డుకున్నారు. తరువాత కాలంలో మహబూబాబాద్ ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పట్టారు. నల్గొండ జిల్లా పర్యటనలో కూడా జగన్ ను అడ్డుకున్నారు. కానీ తరువాత కాలంలో నల్గొండ ప్రజలు కూడా జగన్ కు బ్రహ్మరథం పట్టారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయారనే విషయం తెలిసి బాధతో, గుండెపోటుతో మరణించిన వాళ్ల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ ఓదార్పుయాత్ర చేపట్టాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ ఓదార్పుయాత్రపై విమర్శలు చేశారు. కానీ నాడు విమర్శలు చేసిన నేతలే నేడు వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా గెలిచి జగన్ కు జేజేలు పలుకుతున్నారు. గతంలో జగన్ పై విమర్శలు చేసిన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నేడు జగన్ తో స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు. జగన్ పై విమర్శలు చేసిన బీజేపీ నాయకులు నేడు జగన్ పార్టీని ఎన్డీఏలో చేర్చుకోవాలని యోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
ఏపీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై విమర్శలు చేస్తున్నా జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ ను అసెంబ్లీ సమావేశాల్లో కోరని కోరికలు కూడా తీర్చే దేవుడు జగన్ అని ప్రశంసించారంటే జగన్ ప్రజాసంక్షేమ పాలన, జగన్ పథకాలను అమలు చేస్తున్న తీరు అర్థమవుతుంది. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా జగన్ ప్రవేశపెడుతున్న పథకాలను మెచ్చుకుంటున్నారంటే జగన్ ఎక్కడినుండి ఎక్కడికి ఎదిగాడో అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే జగన్ పై గతంలో రాళ్లు విసిరారో నేడు వాళ్లే జగన్ కు జేజేలు పలుకుతూ జగన్ పరిపాలనపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: