వైఎస్సాఆర్ విజయాల గురించి చెప్పాలి అంటే కేవీపీ గురించి చెప్పాలి.  కేవీపీ వైఎస్సాఆర్ కు వెన్నంటే ఉండి ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలను చూసుకున్నారు.  కేవీపీ రామచంద్రరావు అంటే వైఎస్ కు ఎనలేని అభిమానం ఉన్నది.  ఎన్నో గొప్ప గొప్ప విజయాలలో కేవీపీ భాగస్వామ్యం అయ్యారు.  వైఎస్సాఆర్ విజయాల కోసం కేవీపీ ఎంతగానో కృషి చేశారు.  ఈ సంగతి అందరికి తెలుసు.  వైఎస్సాఆర్ లాగానే అయన లేనప్పుడు కూడా కేవీపీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.  అక్కడే కొనసాగుతున్నారు.  

 

వైఎస్సార్ కు, కేవీపీ కి ఉన్న అనుబంధం గురించి కాంగ్రెస్ పార్టీకూడా గొప్పగా చెప్పుతుంటుంది.  వైఎస్సార్ విజయాల్లో కేవీపీ పాత్ర ప్రముఖంగా ఉన్నది అనే విషయం తెలిసిందే కదా.  ఇక ఇదిలా ఉంటె,  వైఎస్సార్ తరువాత జగన్ వైకాపాను స్థాపించారు.  పార్టీని విజయపథంలో నడిపిస్తున్నారు.  అయితే, వైఎస్ కెవి జగన్ కేవీపీని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.  జగన్ కేవీపీని పక్కన పెట్టి తనకు అత్యంత అనుకూలంగా ఉండే విజయసాయి రెడ్డిని అక్కున చేర్చుకున్నారు.  


జగన్.. విజయసాయి రెడ్డికి మధ్య మంచి అనుబంధం ఉన్నది.  ఇద్దరు కలిసి అనేక విజయాలు సాధించారు.  ప్రతి విషయంలో ఇద్దరు కలిసే ఆలోచనలు చేస్తారు.  జగన్ తరువాత పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి.  గతంలో కోర్టు గొడవల విషయంలో కూడా ఇద్దరే ఉండటం విశేషం. ప్రస్తుతానికి ఇది అవసరం లేదనుకొండి.

 జగన్ విజయసాయి రెడ్డిలు కలిసి పాదయాత్ర చేశారు.  
ఈ పాదయాత్రలో జగన్ అనుసరించాల్సిన వ్యూహాల గురించి, జగన్ అనుసరించాల్సిన మార్గాల గురించి వాటి విధానాలను విజయసాయి రెడ్డి రూపొందించారు.  ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు.  పార్లమెంట్ లో ఫ్లోర్ లీడర్ గా ఉంటూ, జగన్ తరపున, వైకాపా తరపున తన వాణిని కొనసాగిస్తున్నారు.  జగన్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ విజయసాయి రెడ్డి తన అనుబంధాన్ని కొనసాగిస్తుండటం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: