అమరావతిలో సీడెడ్ కాపిటల్ ఉండాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలి అది భాజపా స్పష్టమైన విధానం నిర్ణయమని చెప్పారు. దానితో పాటుగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎం జరుగుంతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. జియన్ రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్ రెడ్డి కమిటీ అంటే బాగుంటుందని మండిపడ్డారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కమిటీ నివేదికలు ఉన్నాయన్నారు.

తెదేపాను గందరగోళంలో నెట్టడానికి సీఎం జగన్ ప్రకటన ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేదని విష్ణు విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలా లేక అధికార వికేంద్రీకరణ జరగాలా అనే సందిగ్ధంలో ఉన్నారన్నారు. హై కోర్టును కర్నూల్ లో పెట్టమంటే నాడు చంద్రబాబు వినలేదని ఈ సందర్బంగా ప్రస్తావించారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి , అప్పటి ముఖ్యమంత్రిగా  చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను తమ జాగీర్ అనుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

ఆ ఇద్దరు కలసి రాష్ట్రాన్ని ఫుట్ బాల్ లా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని భాజపా నాడే చెప్పిందన్నారు. ఎప్పటికి తమ పార్టీ  దానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హై కోర్ట్ రావడం వలన కొత్తగా ఏమి వస్తుంది కర్నూల్ కి మహా అయితే నాలుగు జిరాక్స్ మిషన్లు నాలుగు న్యాయవాదుల భవనాలు తప్ప అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం చంద్రబాబేనని చెప్పారు. మిగిలిన రాష్ట్రాన్ని ముంచేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. 

నాలుగు వేల ఎకరాలు భూ కుంభకోణం జరిగింది అని వైకాపా చెప్తుంది, కుంభకోణం జరిగి ఉంటే ఎందుకు నిరూపించలేకపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. రైతులు ఇష్టమో కష్టమో తమ పొలాలు త్యాగం చేసి రాజధానికి ఇచ్చారన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో అధిక ఎమ్మెల్యేలు మీరే గెలిచారు, మీకు పట్టం కడితే అమరావతి రైతులను మోసం చేస్తారా అని నిలదీశారు. రాయలసీమలో పంటలు పండక ఏడుస్తుంటే , అమరావతి రైతులను మరోలా ఎడిపిస్తున్నారని అన్నారు.ముఖ్యమంత్రి అభివృద్ధి వికేంద్రీకరిస్తారా, లేక పరిపాలన వికేంద్రీకరిస్తారా అని విష్ణు ప్రశ్నించారు. రాజాకీయంగా తెదేపాను ఇబ్బంది పెట్టడానికే పరిపాలన వికేంద్రీకరణ అనేది  వైకాపా ఎత్తుగడల కనిపిస్తుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రాన ప్రాంతాలు అభివృద్ధి చెందవని చెప్పారు. 

హై కోర్ట్ ఒకప్రాంతంలో బెంచ్ ఒక ప్రాంతంలో ఉండాలని ఎవరైనా చెప్తారు దానికి జియన్ రావు కమిటీ అవసరంలేదన్నారు. ఏ రాజకీయ పార్టీ అభిప్రాయాన్నైనా జియన్ రావు కమిటీ పరిగణలోకి తీసుకోలేదన్నారు. జియన్ రావు కమిటీ నివేదిక  చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖలో, మంత్రులు అమరావతిలో, విమానాల్లో తరలిస్తారా వారిని సూటిగా ప్రశ్నించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేయండి అంతే కాని పరిపాలన వికేంద్రీకరణ చేయడం వలన అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: