ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ నిర్ణయాల్లో జరిగిన పలు తప్పులు, నిర్ణయాల వల్ల ఏర్పడిన ఇబ్బందులను ఆయన అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ముఖ్యమైనది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో పలు సమస్యలు ఐదేళ్లుగా అలానే ఉండిపోయాయనేది అందరికీ తెలిసిందే.

 

 

జగన్ సీఎం అయ్యాక ముందు రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లోని సమస్యలు సహృద్భావ వాతావరణంలో  పరిష్కరించుకోవాలనేది సీఎం జగన్ ఆలోచన. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ. ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్య, భవనాల కేటాయింపుపై దృష్టి పెట్టారు. ఆస్తుల విభజనపై మధ్యవర్తిత్వం లేకుండా చేసుకున్నారు. కృష్ణా జలాల పంపకంపై కూడా ఇరు రాష్ట్రాలు చర్చించుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు అందే నీటి విషయంలో కొరత రాకుండా చేయాలని నిర్ణయించారు.

 

 

ఏపీలోని రాయలసీమ, తెలంగాణలోని పాలమూరు, నల్గొండ జిల్లాలకు తాగు, సాగు నీరందించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంల వద్ద జరిగిన చర్చలు జరిగాయి. గోదావరి జలాలు శ్రీశైలంకు తరలించే ఎత్తిపోతల పథకంపై రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి వివాదాలు జరుక్కుండా నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణకు ఏపీ సచివాలయంలోని కే బ్లాక్‌, సౌత్‌ హెచ్‌ బ్లాక్‌, జే, ఎల్‌ భవనాలను అప్పగించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలపై, అందించిన స్నేహ హస్తంపై ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమయింది. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే నిర్ణయాలు మరిన్ని తీసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: