ఇండియాలో పౌరసత్వంపై అలజడులు జరుగుతున్నాయి.  ఇండియన్ ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నాగాని, ప్రతిపక్షాలు కావాలని అలజడులు సృష్టిస్తున్నాయి.  కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.  ఈ విషయంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ముస్లిం పార్టీలు కేంద్రంపై యుద్దాన్ని ప్రకటించాయి.  కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.  


కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులు చెప్పిన విషయాలు అన్ని సవ్యంగానే ఉన్నా రాజకీయం కోసం ఇలా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు చూస్తున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, సందట్లో సడేమియా అన్నట్టుగా కొన్ని అసాంఘిక శక్తులు నిరసనకారుల మధ్యలో చేరి విధ్వంసాలు సృష్టిస్తున్నారు.  ఈ కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.  ముస్లిం దేశాలుగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చిన మైనారిటీలకు ఇండియా పౌరసత్వం కల్పిస్తోంది.  


ఇదే బిల్లులో పెట్టింది.  మైనారిటీలు కాకుండా ఆయా దేశాల నుంచి వచ్చిన ముస్లింలను శరణార్థులుగా చూడాలని లేదంటే వారి దేశాలకు పంపించేయాలని చూస్తున్నది.  ఇండియాలో వాళ్ళు ఎందుకు మైనారిటీలుగా ఉండాలి.. వారికి మైనారిటీ ట్యాగ్ తగిలించి పౌరసత్వం కల్పిస్తే దాని వలన ఇండియా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.  ముందు జాగ్రత్త చర్యల్లో భగంగానే ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నది.  


అయితే, దీనిని కాంగ్రెస్ తో సహా కొని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.  ఇక ఇండియాతో ఎప్పుడు వైరం పెట్టుకోవాలని చూస్తున్న మలేషియా ప్రభుత్వం కూడా పౌరసత్వం బిల్లుపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.  లౌకిక దేశంగా చెప్పుకునే ఇండియా ఇలా చేయడం బాగాలేదని అంటోంది.  అయితే, తమ దేశంలో నివసించే భారతీయుల విషయంలో ఇలానే చేస్తే ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవాలని అంటోంది.  అయితే, ఇది ఇండియా అంతర్గత విషయం అని, బిల్లు గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడటం మంచిది కాదని ఇండియా అంటోంది.  గతంలో మలేషియా ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా ఇలాంటి వాదనే చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: