జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచీ ప్రజా సంక్షేమంపైనే దృష్టి సారించారనే విషయం తెలిసిందే. జగన్ చేసిన తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజా సమస్యలపైనే దృష్టి సారించారు. ఎన్నో వర్గాల ప్రజలు తమ సమస్యలను అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ కు వివరించారు. తండ్రి బాటలోనే పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే ఆయా వర్గాలకు తానేం చేయాలో ముందే నిర్ణయించుకునే అవకాశం కలిగింది. దీనికి తగ్గట్టుగానే సీఎం అయ్యాక తన నిర్ణయాలను అమలు చేస్తున్నారు జగన్.

 

 

ముఖ్యంగా తన మానసపుత్రికలా చూసుకున్న నవరత్నాల అమలుపైన జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. పాలనకు సంబంధించిన మొదటి సమావేశంలోనే ప్రతి అధికారి వద్ద నవరత్నాల మేనిఫెస్టో ఉండాలని వాటి అమలు దిశగానే పరిపాలన చేయాలని ఆదేశించారు. అన్నట్టుగానే ఆశా వర్కర్ల వేతనాలు, ఆటో యజమానులకు నగదు సాయం, మత్స్యకారులకు నగదు సాయం, రైతు భరోసా, వృద్ధాప్య పింఛను, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన.. ఇలా ప్రతి దశలోనూ తాను ఇచ్చిన మాటను నిలుపుకునే దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్. దీంతో ప్రజల్లో జగన్ పై నమ్మకం ఏర్పడింది. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఇటువంటి పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలు చేయటం మరెవరివల్లా కాలేదంటే అతిశయోక్తి కాదు.

 

 

దివంగత వైఎస్ కూడా ప్రజోపయోగ కార్యక్రమాల వైపే మొగ్గు చూపేవారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి పేద, బడుగు వర్గాలకు మేలు చేసారు. జగన్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అందిస్తున్నారు. రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నా ఆర్ధిక సమతుల్యత పాటిస్తూ ముందుకు వెళుతున్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: