ఏ మాత్రం పాలన అనుభవం లేకపోయిన తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన అన్ని నిర్ణయాలని చాలా వ్యూహాత్మకంగానే తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ నిర్ణయాలు ప్రజలకు కూడా మేలు చేస్తున్నాయి. ఇక తాజాగా ఆయన ‘రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చనే ప్రకటన చేయడం వెనుక చాలా వ్యూహాలు ఉన్నాయని అర్ధమవుతుంది. దీని వల్ల రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడం ఒకటైతే...మూడు ప్రాంతాల్లో వైసీపీని బలంగా చేయడం మరొక వ్యూహంగా కనిపిస్తుంది.

 

ఇంకా ముఖ్యంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం పట్ల పెద్ద స్కెచ్ ఉందని అర్ధమవుతుంది. ఎగ్జిక్యూటివ్ అంటే రాష్ట్ర సచివాలయం, పరిపాలన మొత్తం ఇక్కడ నుంచే కొనసాగుతుంది. అంటే మెయిన్ క్యాపిటల్ ఇదే అవుతుంది. దీని వల్ల రాష్ట్ర ప్రజలకు ఉపయోగంతో పాటు పార్టీకు బాగా కలిసి రానుంది. ఎందుకంటే విశాఖ పెద్దగా వైసీపీకి కలిసి రాలేదు. రూరల్ విషయం వదిలిస్తే అర్బన్‌లో బాగా వీక్. 2014లో విజయమ్మ ఎంపీగా పోటీ చేసే ఓడిపోయారు.

 

ఇక మొన్న ఎన్నికల్లో కూడా రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచిన విశాఖ నగరంలోని నాలుగు సీట్లని టీడీపీనే గెలుచుకుంది. అటు ఎంపీ సీటుని ఏదో స్వల్ప మెజారిటీతో వైసీపీ దక్కించుకుంది. దీంతో విశాఖను ఏపీకి పరిపాలనాపరమైన రాజధాని చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటే... విశాఖలో వైసీపీకి సానుకూల పవనాలు వీచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒక్క నిర్ణయంతో వైసీపీ విశాఖలో తిరుగులేని రాజకీయశక్తిగా మారొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం తరువాత జరగబోయే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం సులువు అవుతుంది.

 

అయితే విశాఖ ఎఫెక్ట్ పక్కనే ఉన్న తూర్పు గోదావరి మీద కూడా పడనుంది. ఈ జిల్లా వాసులు కూడా విశాఖని క్యాపిటల్ చేయడాన్ని స్వాగతిస్తున్నారు. ఇక జిల్లాలో జంట నగరాలుగా ఉన్న కాకినాడ, రాజమండ్రిల్లో వైసీపీ సత్తా చాటే అవకాశముంది. ఈ రెండు కార్పొరేషన్‌ల్లో కూడా వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీ బలంగా ఉన్న రాజమండ్రిని దక్కించుకోవడం మరింత సులువు అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: