ఒక్కో దేశంలో ఒక్కొక్కటి ఫేమస్.  కొన్ని చోట్ల ఫుడ్ ఫేమస్ గా ఉంటె మరికొన్ని చోట్ల టెక్నాలజీ ఫేమస్ గా ఉంటుంది.  ఈ శతాబ్దంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశం ఏది అంటే చైనా అని చెప్పాలి.  చైనా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది.  అక్కడి ప్రజల జీవనం ఎంత వినూత్నంగా ఉంటుందో ఆహార అలవాట్లు కూడా అంతే వినూత్నంగా ఉంటుంది.  వినూత్నం అని చెప్పేకంటే కూడా మనం వాటిని చూస్తే ఖచ్చితంగా వాంతి చేసుకుంటాం.  


వాళ్ళు తినే తిండిని చూసి ఒళ్ళు జలదరించుకుంటాం.  పొరపాటున చైనా వెళ్లిన వ్యక్తులు ఆక్కడి రెస్టారెంట్స్ లో ఫుడ్ తినే ముందు ఒకటి రెండుసార్లు అలోచించి ఫుడ్ గురించి తెలుసుకొని ఆర్డర్ చేయడం ఉత్తమం.  లేదంటే కనుక డెబ్బైపోతారు.  అందుకే ఆలోచించాలని అంటున్నారు.  చైనాలో నూటికి 80శాతం మంది నాన్ వెజ్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.  అందుకే అక్కడ గల్లీగల్లీకి ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్ లు ఉంటాయి.  


ఇలాంటి వాటిల్లో కొన్ని ఫేమస్ రెస్టారెంట్ లు ఉన్నాయి.  అందులో పాములను ఆహారంగా ఇస్తుంటారు.  అక్కడ అవి ఫేమస్ అన్నమాట.  దాదాపుగా 10 నుంచి 15 రకాల పాములను ఆహారంగా వినియోగిస్తుంటారు.  అందులో కోబ్రా, నాగుపాము, ఇతర పాములు ఫేమస్.  మాములుగా కూరగాయలు ఎలాగైతే అమ్ముతారో అలానే వాటిని కేజీల లెక్కన అమ్ముతారు.  కావాల్సిన పాములను సెలక్ట్ చేసుకుంటే చాలు.  


అద్భుతంగా వండి ప్లేట్స్ లో ముందు పెడతారు.  వాటిని ఎంచక్కా సాస్ లో ముంచుకొని తినెయ్యొచ్చు.  మనకంటే అలవాటు లేదు.  అక్కడ వాళ్లకు అదే రుచికరమైన ఆహరం.  వాటిని మనం కోళ్లు పెంచినట్టుగా పాములను పెంచుతారు.  చేత్తో తీసుకొని సంచుల్లో వేసుకొని తీసుకెళ్లి కొస్తుంటారు.  ఇదెక్కడి దారుణం అనుకోకండి.  అక్కడ అవి ఫేమస్ మరి.  వెరైటీ ఫుడ్ ను ఇష్టపడే వారు తప్పకుండా చైనా వెళ్ళండి. అక్కడ పాముల ఆహరం రుచి చూడండి.  పాములు విషం కాదా అంటే... విషమైతే వాళ్ళు ఎందుకు తింటారు చెప్పండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: