గత కొద్ది రోజులుగా మెట్రో ప్రయాణికుల సంఖ్య  క్రమంగా పెరుగుతోంది. ఒకవైపు చార్జీల పెంపు వల్ల కొంత మేర ఆర్టీసీ ఆదాయం పెరిగినప్పటికీ ఆకస్మాత్తుగా బస్సులను తగ్గించడంతో ప్రయాణికుల ఆదరణను కోల్పోవాల్సి రావడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో మెట్రో రైల్ తాజాగా  క్యూఆర్ కోడింగ్ ద్వారా టికెట్ తీసుకొనే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 1150 రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో మరిన్ని బస్సులు రద్దు కానున్నాయి. దీంతో సిటీ బస్సు ప్రయాణికుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశముంది. ఆర్టీసీ డీలా పడిపోవడంతో మెట్రో దూకుడు పెరిగింది. ప్రస్తుతం 4.24 లక్షల మందికి చేరింది. హైటెక్‌ సిటీ నుంచి రోజుకు సుమారు 6,125 మంది రాకపోకలు సాగిస్తుండగా, అమీర్‌పేట్‌ నుంచి మరో 4,102 మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. అలాగే మరో ప్రధాన మెట్రో స్టేషన్‌ ఎల్బీనగర్‌ నుంచి 3,950 మంది, మియాపూర్‌ నుంచి 5,150 మంది, బేగంపేట్‌ నుంచి 1500 మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు.

ఇటీవల కాలంలో కూకట్‌పల్లి నుంచి 2,200, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి మరో 1430 మంది పెరిగినట్లు అంచనా. మొత్తంగా గతంలో 4 లక్షలు ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్య 4.24 లక్షలు దాటిపోయింది. ఇటువంటి సాధారణ ఇబ్బందులు కూడా లేకుండా ప్రయాణికుల దగ్గర ఉన్న ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ సౌకర్యంతో టికెట్లు తీసుకొనేలా యాప్ తయారుచేశారు. ఈ యాప్ వెళ్లి ఎక్కాల్సిన స్టేషన్, దిగాల్సిన స్టేషన్ పేర్లను నమోదుచేస్తే చెల్లించాల్సిన టికెట్ చార్జి కనిపిస్తుంది. పేమెంట్ పూర్తికాగానే యాప్ టికెట్ కనిపించడంతోపాటు మొబైల్ మెసేజ్ వస్తుంది.
ఇందుకోసం ఎల్ సంస్థ సరికొత్త యాప్ రూపొందించింది. ఈ యాప్ డౌన్ చేసుకుని రిజిస్టరై.. స్టేషన్ రాకుండానే టికెట్లు పొందే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. స్టేషన్లలో ఉన్న ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్ మెషిన్లు ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ప్రయాణించవచ్చు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల వరకు ఆఖరి మెట్రో  బయలుదేరే విధంగా ఇటీవల హైదరాబాద్‌ మెట్రో రైలు వేళలను మార్చారు. దీంతో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. మరోవైపు ఆర్టీసీ సమ్మె కాలం నుంచి  పెరుగుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య ఇప్పటికే 4 లక్షల మైలు రాయిని దాటింది. వారం రోజులుగా మరో 24 వేల మంది ప్రయాణికులు అదనంగా పెరిగినట్టు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: