గడచిన దశాబ్దకాలంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తిరుగులేని హీరో అయ్యారు. వరుస విజయాలతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కారు జోరుకు బ్రేకులు లేవని నిరూపిస్తున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కలిసి టీఆర్ఎస్ 45 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. 10 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది. 9ఎంపీ స్థానాలకు పోటీ చేయగా 2 స్థానాలలో విజయం సాధించింది. 
 
ఆ తరువాత 2010 సంవత్సరం ఫిబ్రవరి నెలలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో విజయం సాధించారు. 2012 సంవత్సరంలో రెండు సందర్భాలలో జరిగిన ఉపఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్టానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 110 అసెంబ్లీ స్థానాలలో 17 లోక్ సభ స్థానాలలో పోటీ చేసింది. 
 
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించామనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్లగా టీఆర్ఎస్ 63 ఎమ్మెల్యే స్థానాలలో, 11 ఎంపీ స్థానాలలో విజయం సాధించింది. సీఎం కేసీఆర్ రెండు స్థానాలలో గెలవటంతో మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం అక్కడ టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. వరంగల్ ఎంపీ స్థానానికి కడియం శ్రీహరి రాజీనామాతో జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 
 
అ తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు మరణించగా అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 87 స్థానాల్లో ఘన విజయం సాధించింది. 2019 లోక్ సభ ఫలితాల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయింది. 16 స్థానాల్లో విజయం సాధిస్తానని కేసీఆర్ అంచనా వేయగా బీజేపీ 4 స్థానాల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. కొన్ని రోజుల క్రితం జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. సీఎం కేసీఆర్ అన్నీ తానై టీఆర్ఎస్ పార్టీను ప్రతి ఎన్నికలలో విజయ తీరాలకు చేర్చారు. కారు జోరుకు మరే పార్టీ బ్రేకులు వేయలేని విధంగా వరుస విజయాలతో ప్రత్యర్థ పార్టీలకు షాక్ ఇచ్చారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: