హైదరాబాద్ నగరంలో ఒక యువతి బ్యాక్ పెయిన్ సమస్యతో బాధ పడుతూ నిమ్స్ ఆస్పత్రికి వెళ్లింది. మందులు రాసి ఇచ్చినా తగ్గలేదని యువతి మరలా వైద్యులను కలిసింది. బ్యాక్ పెయిన్ తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతోందని చెప్పటంతో వైద్యులు ఎక్సరే అండ్ స్కానింగ్ తీశారు. ఎక్సరే రిపోర్ట్ చూసిన తరువాత బుల్లెట్ ను పోలీన నల్లని వస్తువు ఆమె శరీరంలో ఉన్నట్టు గుర్తించారు.

 

యువతి శరీరంలో ఒక బుల్లెట్ లాంటి వస్తువు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసి ఆ వస్తువును యువతి శరీరం నుండి బయటకు తీశారు. యువతి శరీరంలో నిజమైన బుల్లెట్ ఉండటంతో షాక్ అయిన వైద్యులు యువతిని బుల్లెట్ గురించి ప్రశ్నించారు. ఎన్నిసార్లు అడిగినా యువతి సమాధానం చెప్పకపోవటంతో వైద్యులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 18 సంవత్సరాల వయస్సు గల అస్మా బేగం వెన్నుపూస కండరాల్లో విరిగిన బుల్లెట్ ను వైద్యులు తీశారు. యువతి శరీరంలో సంవత్సరం క్రితం నుండే బుల్లెట్ ఉందని వైద్యులు అనుమానిస్తున్నారు. యువతి శరీరంలోకి బుల్లెట్ ను ఎవరు కాల్చారు...? యువతి బుల్లెట్ గురించి వివరాలను ఎందుకు చెప్పటం లేదు...? యువతిపై ఎవరైనా కాల్పులు జరిపారా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. 
 
యువతి బహదూర్ పురా ప్రాంతoలో నివాసం ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. పోలీసుల విచారణ తరువాత బుల్లెట్ గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. యువతి శరీరంలో బుల్లెట్ ఉన్నట్టు కనీసం ఆమె తల్లిదండ్రులకు తెలుసా...? కనీసం బుల్లెట్ తీయకముందే ఆమెకైనా తెలుసా...? అనే ప్రశ్నలకు కూడా సమాధానం తెలియట్లేదు. కానీ ఈ బుల్లెట్ వెనుక ఏదో మిస్టరీ ఉందనే అనుమానాలు మాత్రం అటు పోలీసుల్లో, ఇటు వైద్యుల్లో వ్యక్తం అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: