బరాక్ ఒబామా... అమెరికా అధ్యక్షుడుగా రెండుసార్లు చేశారు.  అమెరికా అధ్యక్షుడుగా రెండుసార్లు చేసి మాజీ అధ్యక్షుడిగా మారిన తరువాత కూడా ఆయనకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.  అలానే ఆయనలో అమెరికా అధ్యక్షుడిగా చేసిన గర్వం ఏ మాత్రం లేదు.  ఎక్కడికి వెళ్లినా సాదాసీదాగా వెళ్తున్నాడు.  తన పని తానూ చేసుకుంటూ పోతున్నాడు.  రీసెంట్ గా ఒబామా హువాయి రాష్ట్రాల్లోని కణైలిలోని ఓ గోల్ఫ్ కోర్టుకు వెళ్ళాడు.  సరదాగా అయన గోల్ఫ్ ఆడుతుంటాడు.  


అయితే, అక్కడ ఓ తల్లి చిన్న బిడ్డను ఎత్తుకొని ఉన్నది.  ఆ బిడ్డను చూసిన తరువాత ముచ్చటేసి ఆమెను పలకరించాడు.  ఆమె కూడా మాట్లాడింది.  ఒక మాజీ అధ్యక్షుడు తనకు తానుగా వచ్చి మాట్లాడితే ఎవరు మాత్రం మాట్లాడకుండా ఉంటారు చెప్పండి.  వెంటనే ఆమె మాట్లాడింది.  దీంతో ఒబామా ఆ తల్లి చేతిలో ఉన్న చంటి బిడ్డను చేతుల్లోకి తీసుకొని సరదాగా ముద్దాడాడు.  ఆ చంటిబిడ్డ ఒబామావైపు చూడగానే... ఓసారి నేను నీకు పాలు ఇవ్వలేను... అని అన్నాడు.  


అంతే ఆ తల్లి నవ్వేసింది.  అక్కడ ఉన్న వారంతా నవ్వారు.  ఈ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఇది క్షణాల్లో వైరల్ గా మారింది.  దాదాపుగా ఈ సరదా సన్నివేశాన్ని లక్ష మందికి పైగా వీక్షించారు.  ఒబామా చేసిన ఈ సరదా పనితో మరోసారి అయన వార్తల్లోకి వచ్చాడు.  ఒబామా సౌమ్యుడిగా దేశంలో పేరున్నది.  నల్లజాతీయుడు అయినప్పటికీ ఆయనను అక్కడి ప్రజలు రెండుసార్లు దేశాధ్యక్షుడిగా ఎంచుకోవడం విశేషం.  


ఇక ఇదిలా ఉంటె, ఒబామా ఇండియాతో మంచి అనుబంధాలు కొనసాగించారు.  అధ్యక్షుడిగా చేసిన రెండుసార్లలో ఇండియాతో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  ఒబామాకు మోడీ అంటే అభిమానం ఉన్నది.  ఒబామా ఇండియాకు వచ్చినపుడు మోడీ ఆప్యాయతగా స్వాగతించారు.  అలానే మోడీ ప్రధానిగా ఎంపికయ్యాక, అమెరికా వీసాను ఇచ్చింది.  ప్రధాని అయ్యాక అయన అమెరికా దేశంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ మోడీకి లభించిన గౌరవం అంతాఇంతా కాదు.  మోడీని అమెరికా ప్రజలు దగ్గరకు తీసుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: