తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఎప్పుడూ ఒకేలా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఉద్యమ నేత నుంచీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ ఆయన ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఇదే అవగతమవుతుంది. కేసీఆర్ దూకుడే పార్టీకి, ప్రభుత్వానికి బలంగా ఉంది. విపక్షాల నుంచి ఎంతటి ప్రతిఘటనలు, విమర్శలు ఎదురైనా ఆయన లెక్క చేయలేదు. సొంత పార్టీ నేతల నుంచి నిరసన గళం ఎదురైన సందర్భాలలోనూ ఆయన ఉక్కు లాంటి ధీరత్వంతో ఎదుర్కొన్నారు. తెలంగాణ పోరాట యోధుడిగానే కాకుండా ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు కేసీఆర్ లోని మానసిక బలాన్ని తెలియజేస్తున్నాయి.

 

 

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో యాదాద్రి ఆలయం ఆధునీకరణ కూడా ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయ నిర్మాణాన్ని కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కొత్త సచివాలయ నిర్మాణం విషయంలో కొద్దా కేసీఆర్ ఇలాంటి సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. విపక్షాల నుంచి ఎన్ని నిరసనలు వ్యక్తమైనా ఆయన బెదరలేదు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కేసీఆర్ తీరు గమనించదగ్గది అని చెప్పాలి. 57 రోజుల సుదీర్ఘ నిరసన దీక్షలు చేపట్టిన కార్మికుల చేతే దీక్ష విరమింపజేశారు. దీక్షా సమయంలో వారి డిమాండ్లు నెరవేర్చకనే దీక్ష విరమణ జరిగాక వారికి అనేక వరాలు ప్రకటించారు. కేసీఆర్ ఆగ్రహం ఎంత దూరమైనా వెళ్తుంది.. శాంతిస్తే ఎంతైనా ఇస్తుంది అని ఈ ఉదంతం రుజువు చేస్తోంది.

 

 

కేసీఆర్ వ్యవహారశైలి కఠినంగా అనిపించినా తన రాష్ట్ర ప్రయోజనం కోసమే ఏదైనా అని నిరూపిస్తున్నారు. రాష్ట్రాల సంఖ్య పెంచినా.. అధికార వికేంద్రీకరణ జరిగినా అది తెలంగాణ అభివృద్ధి కోసమే అని ప్రతి దశలో నిరూపిస్తున్నారు. పాలనలో తనదైన ముద్ర వేస్తూ రెండోసారి కూడా తిరుగులేని అధిక్యంతో అధికారంలోకి వచ్చారు కేసీఆర్. అదే ఉత్సాహంతో మరోసారి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: