తెలంగాణ రాష్ట్రంలోని ఇంటింటికీ మంచినీరును అందించే మహత్తర కార్యక్షికమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించింది.. అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి పట్టణం, పల్లె గొంతు తడిపేందుకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే నగరంలోని ప్రతి ఇంటికీ సరిపడా మంచినీటిని అందించే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా సుమారు రూ .42,000 కోట్ల రూపాయలతో కృష్ణ, గోదావరి నదులతోపాటు ఇతర జలాశయాలను కలిపి, 1.30 లక్షల కిలోమీటర్లు పైపులైన్ల మార్గం రాష్ట్రంలోని 24,000 గ్రామాలు మరియు 65 పట్టణాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు అందిం చాలన్న లక్యంతో తెలంగాణ సర్కారు ప్రగతి పధంలో అడుగులేస్తోంది. 


మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ 2016, ఆగస్టు 7 ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం లోని కోమటిబండలో ఆవిష్కరించారు. దీంతో దేశంలోనే ఇంటింటికీ నల్లా సౌకర్యం పొందిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ చరిత్ర సృష్టించింది. మిషన్ భగీరథ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ను ప్రారంభించింది.మిషన్ భగీరథ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ను ప్రారంభించింది.

దేశంలో ప్రజలందరికీ సురక్షిత మంచి నీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నది. కాబట్టి మిషన్‌ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 24 వేల ఆవాస ప్రాంతాలకు ప్రతీ రోజు ఉపరితల జలాలను మంచినీరుగా అందించేందుకు మిషన్‌ భగీరథ పథకం చేపట్టాం. తెలంగాణ రాష్ట్రంలో చాల చోట్ల మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేది. చాలా చోట్ల ఫ్లోరైడ్‌ సమస్య ఉండేది. అసలే తాగునీళ్లు దొరకకపోయేది. దొరికిన నీళ్ళు కూడా శుభ్రంగా ఉండకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారు.

అందుకే గోదావరి, కృష్ణా జలాలను శుద్ధి చేసి ప్రతి రోజు ప్రజలకు అందివ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. పథకం దాదాపు పూర్తయింది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ పథకం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకు ఇబ్బందులు తప్పాయి. వారి జీవన పరిస్థితులు మెరుగయ్యాయి. రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభాను కూడా అంచనా వేసుకుని, అప్పటి అవసరాలు కూడా తీర్చే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్‌ చేశాము. ఇలాంటి పథకం దేశమంతా అమలయితే మంచిది. ప్రజలకు మంచినీరు అందించడానికి చేసే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడవద్దు” అని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.

ప్రజలందరికి తాగునీటి సమస్యలను తీర్చడం ఈ పధకం లక్ష్యం. అంతేకాకుండా స్వచ్ఛమైన మంచినీరు అందించడమే  అందరికీ ఆరోగ్యమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం. వచ్చే నెల 31 నాటికి మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి  పూర్తి చేయాలన్న లక్ష్యంతో సాగుతున్నారు.  మూడు సెగ్మెంట్లలో పనులన్నీ పూర్తి చేసి, 2019 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటుచేసి, సురక్షిత మంచినీటిని అందించాలనే కేసీఆర్ ఆశయం. ఎందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ శివారు గ్రామాలకు మంచినీటి వసతిని అందుబాటులోకి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: