ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.  ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఇండియాపై ఆ దేశం ఎంతగా అక్కసు వెళ్ళగక్కిందో తెలిసిందే.  ఐక్యరాజ్య సమితిలో 50 నిమిషాలకు పైగా మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్, తన ప్రసంగం మొత్తం ఇండియాకు వ్యతిరేకంగా, కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘనల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు.

 
ఇప్పటికే దీనిగురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు.  అయినా ఇండియా పట్టించుకోవడం లేదు.  ఇదిలా ఉంటె, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాలో విధ్వంసాలు సృష్టించేందుకు మరో కొన్ని కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  ఇండియాలోని నేవీ స్థావరాలపై విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే చైనాకు చెందిన ఓ యుద్ధనౌక ఇండియా జలాల్లోకి ప్రవేశించింది.  


అప్రమత్తమైన ఇండియా ఆ నౌకను తరిమికొట్టింది.  ఇక ఇదిలా ఉంటె, పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు భూభాగం ద్వారా మాత్రమే ఇండియాలోకి చొరబడి విధ్వంసాలు సృష్టించేవారు.  కానీ, ఇప్పుడు సముద్రమార్గం ద్వారా ఇండియాలోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.  దీనికి పాక్ నేవీ అక్కడి ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.  ఈ ఉగ్రవాదుల సహాయంతో ఇండియాలోకి చొరబడి విశాఖలో విధ్వంసాలు సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  


ఇటీవలే ఆంధ్రప్రదేశ్ కొత్త కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.  ఈ సమయంలో పాక్ నుంచి దీనికి ముప్పు పొంచి ఉంది అంటే... ఆలోచించాల్సిన విషయమే.  కార్యనిర్వాహక  రాజధానిగా విశాఖను అధికారికంగా ప్రకటించకముందే ఇలా జరగబోతుంటే, ఇక నిజంగా అక్కడ రాజధాని ఏర్పాటు చేసిన తరువాత ఏదైనా జరగరానిది జరిగి ఉగ్రవాదులు అక్కడ హింసాకాండకు పాల్పడితే ఇంకేమైనా ఉన్నదా... 1965 యుద్ధం సమయంలో పాకిస్తాన్ కు చెందిన ఘాజి జలాంతర్గామి ముంబై, కొచ్చిన్, చెన్నై దాటుకొని వచ్చి విశాఖలో విధ్వంసం సృష్టించేందుకు ట్రై చేసింది.  కానీ, ఐఎన్ఎస్ విక్రాంత్ అప్రమత్తంగా వుంది ఘాజి జలాంతర్గామిని పేల్చివేసింది.  ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్న అప్పట్లో తూర్పు తీరంలో ఉన్న విశాఖకు భారీ ప్రమాదం జరిగేది.  

మరింత సమాచారం తెలుసుకోండి: