మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్నేహితురాలుగా మనందరికి సుపరిచితమైన శశికళ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే అనేక కేసుల్లో ఈమె నిందితురాలిగా రుజువు అయ్యి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇలాంటి విపత్కర  సమయంలో రద్దు అయిన పెద్ద నోట్లతో భారీగా ఆస్తులు సమకూర్చినట్లు ఐటీ శాఖ తమ నోటీసుల్లో ఆరోపించింది. వీటి విలువ ఐటీ శాఖ ప్రకారం దాదాపు 1674 కోట్లగా గుర్తించారు.

 

 శశికళ ఆస్తులు అమ్మిన వ్యక్తులు వారికీ వచ్చిన రద్దయిన పాత నోట్లను వివిధ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసిన సమయంలో ఐటీ శాఖ గుర్తించింది. అలా గుర్తించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చింది. నవంబరు 8 2016న నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించగానే శశికళ చెన్నై పెరంబుర్ మధురై కేకే నగర్ ప్రాంతంలో షాపింగ్ మాల్స్ ను అలాగే పుదుచ్చేరిలో ఒక రిసార్టు కూడా కొనుగోలు చేసినట్లు విచారణలో బయటికి వచ్చింది. దానితో పాటు కోయంబత్తూర్ లో ఒక పేపర్ మిల్లు, చెన్నైలో ఒక చెక్కర మిల్లును, మహాబలిపురం రోడ్డులో సాఫ్ట్ వేర్ కంపెనీని అలాగే కోయంబత్తూర్లో 50 మెగా వాట్ల పవన విద్యుత్ ప్లాంట్ ను  శశికళ కొనుగోలు చేసినట్టు ఐటీ శాఖ అధికారులు కోర్టుకు వివరించారు.

 

 ఇలా కొనుగోలు చేసిన ఆస్తులు మొత్తం కూడా డబ్బు రూపేణా వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై శశికళ స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీని పై వివరణ ఇవ్వాలంటూ ఐటీ శాఖను కోర్టు ఆదేశించింది.

 

అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి త్వరగతిన ప్రక్రియను ముగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. జయలలిత మృతి తర్వాత శశికళకు దెబ్బ మీద దెబ్బ పడుతూ అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. శశికళ ఇప్పుడు ఎదురవుతున్న ఆరోపణలు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: