ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ సీఎం జగన్ ప్రజల సంక్షేమం కొరకు సంచలన నిర్ణయాలను తీసుకుంటూ ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్న విషయం తెలిసిందే. పాలనాపరంగా సీఎం జగన్ దూసుకుపోతూ ఉండటంతో పచ్చ బ్యాచ్ ఎప్పుడూ జగన్ కు వస్తున్న మంచిపేరును చెడగొట్టటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఏపీకీ మూడు రాజధానులు ఉండొచ్చని చెప్పిన రోజు నుండి పచ్చ బ్యాచ్ తమ అనుకూల పత్రికల ద్వారా లెక్కకు మించిన కథనాలను వండివారుస్తూ విషం కక్కుతూనే ఉంది. 
 
పచ్చబ్యాచ్ మొదట రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించింది. రైతులతో నిరాహారదీక్షలు చేయించి పచ్చబ్యాచ్ పబ్బం గడుపుకుంది. ఆ తరువాత రాజధాని ప్రాంతంలో వేల ఎకరాల భూములను బినామీ పేర్లతో కొనుగోలు చేసిన కమ్మ సామాజిక వర్గం అన్యాయం అయిపోతుందని గగ్గోలు పెట్టేందుకు కూడా పచ్చ బ్యాచ్ ప్రయత్నాలు చేసింది. ఆ తరువాత రైతులతో రంగులు పూయించి రైతులతో పచ్చ బ్యాచ్ ఆందోళన చేయించింది. 
 
పచ్చ బ్యాచ్ రైతులు అని చెబుతున్న వారిలో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని వార్తలు వినిపిస్తూ ఉండటం గమనార్హం. పచ్చ బ్యాచ్ ఎన్ని ప్లాన్లు వేసినా వారి పాచికలు పారకపోవటంతో చివరకు పచ్చబ్యాచ్ మతాన్ని తెరమీదకు తీసుకొస్తూ ఉండటం గమనార్హం. రాజధాని ప్రాంతంలోని ప్రజలను పచ్చ బ్యాచ్ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అంటూ విడదీసి వారి మధ్య మంటలు వేసి చలి కాచుకునే ప్రయత్నాలు చేస్తోందని కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. 
 
చంద్రబాబు సభలో ఒక వ్యక్తి మాట్లాడుతూ అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వానికి ఇచ్చామని మాకు మంచి ప్యాకేజీ అందిందని ప్రభుత్వం ఫ్లాట్లు ఇచ్చిందని జగన్ దళితులకు, రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. మతాలను అడ్డం పెట్టుకొని రాజధాని ప్రాంతంలో పెయిడ్ ఆర్టిస్టులతో పచ్చ బ్యాచ్ వ్యాఖ్యలు చేయిస్తూ రాజధానికి హిందుత్వ మసి పూసి ఇతర మతాలను, కులాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని రాజధాని ప్రాంతంలోని ప్రజలు చెవులుకొరుక్కుంటున్నారు. పచ్చ బ్యాచ్ ప్రజలకు మంచి చేయాలని నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ పేరును అప్రతిష్టపాలు చేయటానికి మతాలను కూడా అడ్డం పెట్టుకుంటోందని పచ్చ బ్యాచ్ నీచ రాజకీయాలకు దిగుతోందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: