నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండే స్వామి నిత్యానంద ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపాడు. నిత్యానంద తన దేశానికి ఓ తమిళ నటిని ప్రధానమంత్రి చెయ్యాలని నిర్ణయించాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిత్యానంద దేశానికి తమిళ నటి ప్రధాని అవుతున్నారనే ఆ వార్త కలకలం సృష్టిస్తోంది. నిత్యానంద పేరు ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి వివాదంలో ఉంది. నిత్యానంద చాలా రాష్ట్రాల్లో ఆశ్రమాలు నడుపుతూ భోదకుడిగా, ఆయన శిష్యులకు గురువుగా చెలమాణీ అవుతున్నాడు. ఇప్పుడు మైనర్ అమ్మాయిలను కిడ్నాప్ చేశాడని ఆరోపణలు రావడంతో గుజరాత్ పోలీసులు నిత్యానందను అరెస్టు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశం విడిచిపారిపోయిన నిత్యానంద ఏకంగా దక్షిణ అమెరికా దేశం సమీపంలోని ఓ దీవిని సొంతంగా కొనేశాడని, దానికి కైలాస దేశంగా ప్రకటించుకున్నాడని, ఆ దేశానికి తమిళ నటిని ప్రధాని చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాదు మరో విషయం కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.


నిత్యానంద నకిలీ పాస్ పోర్టుతో దేశం విడిచిపారిపోలేదని, ఇక్కడే ఎక్కడో తలదాచుకున్నాడని, త్వరలోనే ఆయన్ను అరెస్టు చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విదేశాలకు పారిపోయిన నిత్యానంద కైలాస దేశం ఏర్పాటు చేసుకున్నాడని ఆయన శిష్యులు ప్రత్యేక వెబ్ సైట్ తయారు చేసి పలు వివరాలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం నిత్యానంద గొడవ మాత్రం మరోసారి మీడియాలో హాట్ టాఫిక్ అయ్యింది. నిత్యానంద దేశానికి తమిళ నటి ప్రధాని అవుతుందా ? ఆసలు నిత్యానంద ప్లాన్ ఏమిటి ? అనే విషయంపై రోజుకో కథనం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


కైలాస దేశంలో పౌరసత్వం కోసం 12లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు నిత్యానంద వెల్లడించాడు. త్వరలోనే కైలాస దేశం ఏర్పాటుపై పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ దేశంలో పౌరసత్వం కోసం ఎంక్వైరీ చేసే వారితో తమ ఈమెయిల్స్ నిండిపోతున్నాయని, కైలాస దేశం కోసం చందాలు ఇచ్చిన దాతలకు కృతఙ్ఞతలని తెలిపాడు. ఇక తన దేశంపై వస్తోన్న విమర్శల వల్లనే దానికి ఇంకా పాపులారిటీ వచ్చిందని.. డబ్బుల కోసమే కొంతమంది తన దేశంపై విమర్శలు చేస్తున్నారని అన్నాడు. కైలాసం అనేది ఓ భౌగోళిక ప్రాంతం కాదని.. ఇదొక ఆధ్యాత్మిక భావన అని నిత్యానంద చెప్పుకొచ్చాడు. అయితే తాము నిత్యానందకు ఎలాంటి భూమి కేటాయించలేదని.. తమ ప్రభుత్వానికి, ఆయనకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఈక్వెడార్ ఎంబసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు కైలాసం వదిలేసి హైతీ వెళ్లినట్లు ఈక్వెడార్ ప్రభుత్వం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: