సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజున నేపాల్ నుంచి ఇండియాకు 180 మందితో కూడిన ఇండియన్  లైన్స్ కు చెందిన విమానం బయలుదేరింది.  అలా బయలు దేరిన కాసేపటికి దానిని హైజాక్ చేశారు ఉగ్రవాదులు.  అమృత్ సర్ కు తీసుకొచ్చి ఇంధనం నింపుకోవాలని చెప్పి ల్యాండింగ్ చేసి అక్కడ ఉగ్రవాదులను మట్టుపెట్టాలని అనుకున్నారు.  కానీ, కుదరలేదు.  ఆ విమానం ఇంధనం నింపుకోకుండానే అమృత్ సర్ నుంచి పాకిస్తాన్ అక్కడి నుంచి దుబాయ్ అక్కడి నుంచి తాలిబన్ చెరలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ కు విమానం తరలివెళ్లింది.  


ఇండియా జైల్లో ఉన్న మసూద్ ను విడుదల చేయకుంటే 180 మందిని చంపేస్తామని బెదిరించారు.  దీంతో ఇండియా దిగిరాక తప్పలేదు.  ఇండియా జైల్లో ఉన్న మసూద్, మరో ఇద్దరినీ కూడా భారత ప్రభుత్వం విడుదల చేసింది.  అయితే, ఫ్లైట్ హైజాక్ కు సంబంధించిన సమాచారం నిఘావర్గాలకు ముందుగానే తెలిసినా ప్రభుత్వం లైట్ గా తీసుకుంది.  రా వర్గాలు కూడా సీరియస్ గా తీసుకోకపోవడంమే దీనికి ఉదాహరణ.  హైజాక్ జరిగిన విమానం ఇండియన్ రా వ్యక్తి ఉండటం వలన అమృత్ సర్ లో విమానం దిగిన వెంటనే చర్యలు తీసుకోలేకపోయింది.  


భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  ఇది చాలా దారుణమైన విషయంగా చెప్పాలి.  భద్రతాపరమైన చర్యలు తీసుకోవడానికి అప్పట్లో ఇండియా ఎందుకు ఆలోచనలో పడిందో తెలియడం లేదు.  ఇలాంటి ఎన్నో విషయాల్లో ఇండియా తప్పులు చేసింది.  ఫలితంగా ఇప్పుడు మసూద్ ఇండియాపై విషం చిమ్ముతున్నాడు.  జైలు నుంచి విడుదలయ్యాక ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాక్ కు వెళ్లిన మసూద్ జైషే మహ్మద్ పేరుతో ఉగ్రవాద సంస్థను స్థాపించి ఇండియాపై కుట్రలు పన్నుతున్నాడు.  


పఠాన్ కోట్ పై దాడి, కాశ్మీర్ లో దాడులు ఇంకా అనేక చొరబాట్లు, ఆత్మాహుతి దాడులు ఇవన్నీ కూడా మసూద్ సంస్థ జైషే మహ్మద్ నుంచి వచ్చిన వ్యక్తుల పనులే.  ఆ హైజాక్ వైఫల్యం జరిగి ఇప్పటికి 20 ఏళ్ళు అయ్యింది.  ఈ 20 సంవత్సరాల్లో ఇండియా ఏం నేర్చుకుందో ఎంత వరకు సఫలం అయ్యిందో తెలియదుగాని, ఇప్పటికైనా ఇండియా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటేనే దేశం భద్రంగా ఉంటుంది.  ఎలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: