ఇటీవల హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు సొంతం చేసుకోవడంతో... ఇక తమకు తిరుగులేదని కారు పార్టీ అనుకుంటూ ఉంటే... అంత సీన్ లేదంటూ  బీజేపీ వర్గాలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా పౌరసత్వ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్... బీజేపీతో తేల్చుకోవడానికి సిద్ధం అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తెలంగాణలో బలంగా పాతుకుపోయేందుకు RSS, bjp పక్కా వ్యూహాలు అమలు చేయడానికి సిద్ధం అవుతున్నాయి.

 


 అందులో భాగంగానే తెలంగాణలో  నేడు ఆర్ఎస్ఎస్ భారీ శిబిరం ఏర్పాటు అవ్వడం జరిగింది. నేటికీ RSS ఏర్పడి 2025 నాటికి వందేళ్లు పూర్తి చేసుకోవడం గమనార్థకం. గతంలో లాగా తెలంగాణ మొత్తం విస్తరించేలా ఆర్ఎస్ఎస్ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇక దీని కోసం నేటి నుంచీ 3 రోజుల పాటు హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లోని నవభారత్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ‘విజయ సంకల్ప శిబిరం’ పేరుతో భారీ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం చేయడానికి సిద్ధం అవుతూ ఉంది. ఈ కార్యక్రమంలో  RSS చీఫ్ మోహన్‌ భగవత్‌... 8000 మంది శిక్షక్‌లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో శిక్షణలో భాగంగా  కుటుంబ విలువలు, గో సేవ, గ్రామ వికాసం, హిందూ ధర్మ ప్రచారం, జల సంరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ, సామాజిక సామరస్యం వంటి అంశాలపై ఇవ్వడం జరుగుతుంది అని తెలియచేయడం జరిగింది. 

 


ఇక తెలంగాణలోని కోరుట్లలో మొట్టమొదటి RSS శాఖ 1936లో  ప్రారంభం అవ్వడం జరిగింది. గత 60 ఏళ్లలో తెలంగాణాలో 2000 సంఘ్‌ శాఖలు కూడా ఏర్పడం విశేషం. ఒక్క 2019 సంవత్సరంలోనే 1000 శాఖలు ఏర్పడాయి అంటే నమ్మండి. కేవలం హైదరాబాద్‌‌లోనే 789 బస్తీల్లో 800 శాఖలు ఉన్నాయి. ఈ సంవత్సరం RSS 1600కు పైగా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇలా  RSS తెలంగాణలో విస్తరించేందుకు ప్రయత్నాలు చేయడం వెనక సామాజిక సేవా దృక్పథంతోపాటూ... రాజకీయ ఎత్తుగడ కూడా ఉంది అని అభిప్రాయలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: