ప్రస్తుతం ఏపీ రాష్ట్రమంతా మొత్తం రాజధాని వ్యవహారం పై సెగలు కక్కుతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అని ప్రకటించడం తో రాష్ట్రంలో ఈ వేడి సెగలుమొదలైనాయి. అమరావతి లోనే రాష్ట్ర రాజధాని ఉంచాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తులో ధర్నాలు చేస్తున్నారు. అయితే ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఉద్యమాలు చేసినా విశాఖ లోనే రాజధాని ఖచ్చితముగా వచ్చి తీరుతుందని ఘంటాపథంగా చెప్పారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంగారు.

 

ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని తీర్చే నాయకుడి కోసం ఎన్నో కలలు కన్నామని అటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రూపం లో ముఖ్యమంత్రిగా రావటం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని కొనియాడారు. ఉత్తరాంధ్ర ప్రజల అదృష్టము ఫలించిందని వ్యాఖ్యానించారు.మూడు రాజధానులు నాలుగు ప్రాంతాయ మండళ్ల ఏర్పాటు చెయ్యడానికి సీఎం జగన్ గొప్ప ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

 

నచ్చని వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు.భవిష్యత్తులో వైఎస్ జగన్ నాయకత్వాన్ని వదులుకుంటే ఉత్తరాంధ్ర వాసులంతా తెలివి తక్కువ వారు మరొకరు ఉండరని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాయకుడంటే దమ్మున్నోడు.,నాయకుడంటే గుండెబలమున్నాడో., ఎవరికీ భయపడని వాడును,అలాంటి నాయకుడే మన ముఖ్యమంత్రి జగన్ గారుఅని పొగడ్తలు గుప్పించారు.. అన్ని ప్రాంతాల వాసులకు సమన్యాయం చెయ్యాలని జగన్ గారి అభిప్రాయము అయితే ఈఉద్యమాలెందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని అన్నారు.


   .అమరావతిలో ఉద్యమాలు చేసేదంతా భూములు చౌకగా కొట్టేసి నోళ్లు పచ్చ చొక్కావాళ్లే అని టిడిపి పార్టీ నాయకులపైఎద్దేవా చేశారు.విశాఖ పట్నంకు పాలనా ది కారాన్ని రాజధాని ,కర్నూలు పట్నం లో హైకోర్టు కావాలంటున్నారా.వద్దంటున్నారా అని ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. అమరావతి లో లెజిస్లేచర్ రాజధాని ఉండాలంటారా? వద్దంటారా.? అన్నదాని పై మాజీ సీఎం చంద్రబాబు టీడీపీ నేతలు జవాబు చెప్పాలన్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం మేము చేస్తుంటే ఉద్యమాలు మీరు చేస్తున్నారా అని జగన్ ప్రభుత్వము అభివృద్ధి కోసం పనిచేస్తుంటే మీకు ఈ వేషాలు వేయడము బాగాలేదు,ఇంకా బుద్దిరాలేదా అని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా బ్రహ్మ దేవుడు ఉద్యమాలు చేసేవారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని, సక్రమంగా ఉండాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరుకుంటున్నానని అన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: