ఏపీ సీఎం జగన్ కు క్రమంగా సినిమా రంగం నుంచి మద్దతు లభిస్తోంది. ఆయన ఇటీవల తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయాన్ని  మెగాస్టార్ చిరంజీవి సపోర్టు చేసిన సంగతి తెలిసిందే. విశాఖను రాజధాని చేయడాన్ని చిరంజీవి పూర్తిగా సపోర్ట్ చేశారు. దీనిపై ఓ లేఖ విడుదలచేశారు. ఇది సంచలనం సృష్టించింది. సాధారణంగా మొదటి నుంచి సినీ పరిశ్రమలోని పెద్ద తలకాయలు జగన్ పట్ల సానుకూలంగా లేరు.

 

కానీ చిరంజీవి వంటి మెగాస్టార్ సపోర్ట్ చేయడం ఆసక్తి రేపింది ఇప్పడు ఈ మద్దతు క్రమంగా పెరుగుతోంది. తాజాగా సినీ రచయిత జగన్ కు మద్దతు తెలిపారు. అమరావతి దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ అబిప్రాయపడ్డారు. ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అభివృద్ధిని ఒక ప్రాంతానికే కేంద్రీకృతం చేస్తే ఏమవుతుందనేది హైదరాబాద్ విషయంలో అర్థం అయిందని అన్నారు. చట్టాలు ఒక చోట, అమలు ఒక చోట, న్యాయ వ్యవస్థ ఒక చోట ఉండటం తప్పు కాదన్నారు.

 

విశాఖపట్నం అందమైన, అద్భుతమైన నగరం అని.. రాజధానిగా విశాఖ సరైన ప్రదేశం అని చిన్ని కృష్ణ అభిప్రాయపడ్డారు. అమరావతిలో రాజధానికి వెయ్యి ఎకరాలు సరిపోతుందని, 33వేల ఎకరాలు అవసరమే లేదన్నారు. గ్రాఫిక్స్‌లో రాజధానిని కట్టడం సినిమాలో జరుగుతుందని, రాజకీయాలలో కష్టం సాధ్యం అని ఆయన అన్నారు. అమరావతి నదీ పరివాహక ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్ చేయడం తప్పు అని, రైతులు వాస్తవాలను గ్రహించి తమ తమ భూములను వెనక్కి తీసుకోవాలని సూచించారు.

 

 చిరంజీవి ప్రకటనను చిన్నికృష్ణ స్వాగతించారు. చట్టాలు అమరావతిలో చేస్తారు..వాటిని అమలు విశాఖలో చేస్తారు. అమలు చేయకపోతే కర్నూలు లో శిక్ష వేస్తారు అని ఆయన అభివర్ణించారు. ఏదేమైనా జగన్ కు క్రమంగా సినీ మద్దతు పెరుగుతోంది. ఇది ఆసక్తికర పరిణామమే..కాదంటారా..

మరింత సమాచారం తెలుసుకోండి: