విశ్వాసంగా ఉండే ఒక కుక్కను చంపడంకోసం, దానిపై పిచ్చికుక్కనే ముద్రవేసినట్లు గానే, అమరావతిపై జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒకపద్దతి ప్రకారం గడిచిన ఏడునెలల్లో దుష్ప్రచారం చేసిందని టీడీపీఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అపోహ లు, అసత్యాలు, అవాస్తవాలతో ఇప్పటికే ఈ తంతుని ప్రభుత్వం పూర్తిచేసిందన్నారు.  రూ.2లక్షల50వేల కోట్లఅప్పులు ప్రభుత్వానికి ఉన్నాయని, మరో లక్షకోట్లు వెచ్చించి అమరావతిని నిర్మించలేమని జగన్‌, మంత్రులు చెప్పడం దారుణమన్నారు. 

 

అమరావతి నిర్మాణానికి అక్కడున్న భూములే సరిపోతాయన్నారు. ప్రభుత్వ, రైతుల అవసరాలకు పోను మిగిలిన 10వేల ఎకరాలపై రూ.లక్షకోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఆడబ్బుతో నే రాజధానిని నిర్మించే అవకాశం ఉన్నా, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకుండా     ముంపునకు గురవుతుందని, నిర్మాణ ఖర్చు ఎక్కువని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.    అమరావతి ముంపునకు గురికాదని నేషనల్‌గ్రీన్‌ ట్రైబ్యునల్‌ స్పషంచేస్తే, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌లతో పోల్చిచూస్తే అమరావతిలోనే నిర్మాణఖర్చు తక్కువని ఇంజనీరింగ్‌ నివేదికలు స్పష్టంచేశాయన్నారు. 

 

అమరావతి ప్రాంతం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమని, అక్కడ 75శాతం వరకు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలుంటే, 29గ్రామాల్లో కాపులున్నారని, కమ్మ రెడ్డి, వర్గాలు సమానంగా ఉంటే, ఒకే వర్గమని జగన్‌ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని నిమ్మల ఆక్షేపించారు. 2014 జూన్‌ 2 నుంచి, సెప్టెంబర్‌లో అమరావతి ప్రకటన జరిగేవరకు కేవలం పదుల ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. వైసీపీప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నట్లుగా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగుంటే దానిపై హైకోర్టు సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఇప్పటికే టీడీపీ డిమాండ్‌ చేస్తోందన్నారు. దేశంలోని అన్నిరాష్ట్రాల రాజధానుల నుంచే 50 నుంచి 60శాతం వరకు ఆదాయం వస్తోందనే వాస్తవాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. 

 

13జిల్లాల అభివృద్ధికి అవసరమైన సంపదసృష్టి కేంద్రమైన అమరావతిని నాశనం చేస్తున్న జగన్‌సర్కారు, భవిష్యత్‌లో అభివృద్ధి లేకుండా చేస్తోందని రామానాయుడు వాపోయారు. అమరావతి నిర్మాణంద్వారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తే, జగన్‌సర్కారు రాష్ట్రరాజధా నిని సోమాలియాపక్కన, ఆఫ్ఘనిస్తాన్‌ పక్కన, దక్షిణాఫ్రికా పక్కన ఉండేలా చేసిందన్నారు.     రాష్ట్ర విభజనచట్టం ప్రకారం రాష్ట్రహైకోర్టుని తరలించే అవకాశాలు లేవని, ఈ విషయం తెలిసీ కూడా జగన్మోహన్‌రెడ్డి రాయలసీమలో హైకోర్టు పెడతామంటూ ఆప్రాంత  వాసుల్ని మోసం చేస్తున్నాడని నిమ్మల స్పష్టంచేశారు. విభజనచట్టంలోని 31/1 క్లాజ్‌ ప్రకారం, కొత్తగా ఏర్పాటైన రాజధానిలోనే హైకోర్టు ఉండాలని, 31/2 ప్రకారం దేశ అధ్యక్షులవారి ఉత్తర్వులను అనుసరించాలని, క్లాజ్‌ 31/3ప్రకారం హైకోర్టు ఏర్పాటు చేసినప్రాంతంకాకుండా, ఇతరప్రాంతాల్లో బెంచ్‌లు ఏర్పాటుచేయాలని స్పష్టంగా పేర్కొన డం జరిగిందని రామానాయుడు వివరించారు. 

 

విభజనచట్టం ప్రకారం హైకోర్టుని మార్చడం ఎట్టిపరిస్థితుల్లోనూ వీలుకాదన్నారు. విశాఖలో, కర్నూలులో కోర్టు బెంచ్‌లు ఏర్పాటుచేయడం వల్ల ఆప్రాంతాలకు ఏవిధమైన ప్రయోజనం ఉండదన్నారు. విశాఖను  ఆర్థికరాజధానిగా, సినీ ఇండస్ట్రీగా, టెక్నాలజీహబ్‌గా, టూరిజం కేంద్రంగా మార్చే క్రమంలో చంద్రబాబు అనేక సంస్థలను తీసుకురావడం జరిగిందని, జగన్‌ వచ్చాక  ఆ సంస్థలన్నీ వెనక్కు పోయాయన్నారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఉన్న అమరావతిని అభివృద్ధిచేయలేని పాలకులు, ఈవిభాగాలన్నీ విశాఖకు తరలిస్తామని చెప్పడం, ఆనగరాన్ని అభివృద్ది చేస్తామని చెప్పడం ప్రజల్ని మోసగించడం కాదా అని  నిమ్మల నిలదీశారు. వ్యవస్థలను లెక్కచేయని ముఖ్యమంత్రి జగన ్‌అని,  గతంలో లక్షలకోట్లు దోచుకున్నా ఆయన ధనదాహం తీరలేదని, అందుకే ఇప్పుడు విశాఖభూ ములపై కన్నేశాడన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: