ఏపీ సీఎంగా జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఆరు మాసాలే అయింది. ఒక్క‌సారి ఎన్నిక‌ల‌కు ముందుప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఆయ‌న‌పై చేసిన విమ‌ర్శ‌ల‌ను ప‌రిశీలిస్తే.. జ‌గ‌న్ కు ఏం అనుభ‌వం ఉంద‌ని సీఎం చేయాలి?  సీఎం కొడుకు అనే ఒక్క హోదాతోనే ఆయ‌న‌కు సీఎం ప‌ద‌వి కట్ట‌బెట్టాలా?  కానిస్టేబుల్ కుమారుడికి సీఎం అయ్యే అర్హ‌త లేదా? ఇదీ.. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు చేసిన విమ‌ర్శ‌లు. ఇప్పుడు జ‌గ‌న్ సీఎంగా ఆరు మాసాలు పూర్త‌య్యాయి. మ‌రి ఆరు మాసాల పాల‌న చూశాక‌.. ప్ర‌జ‌ల మాట ఎలా ఉన్నా.. ప్ర‌దాన రాజ‌కీయ ప‌క్షాల‌కు మ‌తి పోయి దిమ్మ‌తిరిగిపోతోంది!!

 

క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు వారికి బిగ్ షాక్‌గా మారిపోయాయి. ఇటీవ‌ల అసెంబ్లీ వేదికగా జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేసే వ‌ర‌కు రాష్ట్రంలో మూడు రాజ‌ధానులు ఉంటాయ‌ని, వ‌స్తాయ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అదేవిధంగా సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీక‌రం చేసిన త‌ర్వాత డిప్యూటీ సీఎంలుగా ఐదుగురి ని ప్ర‌క‌టించిన‌ప్పుడు కూడా రాజ‌కీయ వ‌ర్గాలు ఖిన్నుల‌య్యాయి.

 

స‌రే! ఇప్పుడు జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌, విశాఖ‌లో చేస్తున్న హ‌డావుడి... స్థ‌లాల వెతుకులాట వంటివి చూస్తే.. ఆరు నూరైనా నూరు ఆరైనా.. జ‌గ‌న్ విశాఖ‌లోనే రాజ‌ధానిని ఎంచుకునే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. గ‌తంలోనూ ఈ ప్ర‌తిపాద‌న‌ను బీజేపీ నేత‌ల నుంచే మ‌నం విన్నాం. అంత‌ర్జాతీయ రాజ‌ధాని స‌హా ఐటీ హ‌బ్ ఉన్న విశాఖ‌ను రాజ‌ధాని చేస్తే.. బాగుండేద‌ని బీజేపీ పెద్ద‌లు చాలా సార్లు అన్నారు. అయితే, ఇప్పుడు రాజ‌ధాని అనే అంశం రాష్ట్రాల జాబితాలో ది కాబ‌ట్టి కేంద్రం జోక్యం చేసుకునే అవ‌కాశం పెద్ద‌గా ఉండ‌దు.  దీంతో జ‌గ‌న్ ప్ర‌య‌త్నం సులువుగానే సాగిపోతుంది.

 

న్యాయ ప‌ర‌మైన ప్ర‌మాదాలు వివాదాలు కూడా పెద్ద‌గా వ‌చ్చే ఛాన్స్ లేదు. దీంతో జ‌గ‌న్ ప‌ని తేలికే అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నారు. అయితే, అస‌లు రాజ‌కీయంగా జ‌గ‌న్ వ్యూహం ఏంట‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఏ వ్యూహంతో జ‌గ‌న్ విశాఖ‌ను ఎంచుకున్నారు? ఏ వ్యూహంతో ఆయ‌న విశాఖ‌లో రాజ‌ధానిని ఏర్పాటు చేస్తున్నారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

 

ముఖ్యంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో జ‌గ‌న్ విశాఖ స‌హా ఉత్త‌రాంధ్ర‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. వెనుక‌బ డిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళంను అభివృద్ధి చేస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. దీనిని సాధించ‌డం రాజ‌ధా ని అక్క‌డ ఏర్ప‌డడం వ‌ల్లే సాధ్య‌మ‌ని అంద‌రూ భావిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి వ‌ల‌స‌లు త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో పూర్తిగా ప‌ట్టు సాధించ‌డంతోపాటు .. టీడీపీని కోలుకోకుండా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ అడుగులు వేస్తు న్నారు.

 

విశాఖ‌లో రాజ‌ధాని ఏర్పాటు వ‌ద్ద‌ని చెప్పే ధైర్యం ఏ ఒక్క‌రికీ లేక‌పొవ‌డం, అంతా ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు ముడిప‌డిపోవ‌డం వంటివి జ‌గ‌న్‌కు భారీ ఎత్తున లాభిస్తున్నాయి. సో.. ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్ వ్యూహానికి ప్ర‌ధాన ప‌క్షాల ప‌క్షులు నేల‌కూల‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: