ఒక్క త‌ప్పు.. కీల‌క‌మైన టీడీపీకి ఇప్పుడు అక్క‌డ అడ్ర‌స్ లేకుండా చేసిందా? ఒకే ఒక్క నిర్ణ‌యం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ జెండాను సైతం మోసేవారిని లేకుండా చేసుకుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు కృష్ణా జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం, టీడీపీ వ్య‌వ‌స్తాప‌కులు అన్న‌గారు ఎన్టీఆర్ పుట్టిన నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ కు చెందిన రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఆదిలో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ హ‌వా పోయి.. వ్య‌క్తి హ‌వాకు చంద్ర‌బాబు హ‌యాంలోనే బీజం ప‌డింది.

 

చంద్ర‌బాబు హ‌యాంలో నే ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానికి బాబు తీవ్ర‌మైన స్వేచ్ఛ ఇచ్చార‌ని అంటారు అప్ప‌టి నాయ‌కులు. దీంతో కొడాలి నాని వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను పెంచుకుంటూ పోయారు. దీనికితో డు సామాజిక వ‌ర్గం ప్ర‌భావం, యువ నాయ‌కుడిగా, దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం వంటివి ఆయ‌న‌ను గుడివాడలో తిరుగులేని హీరోగా నిల బెట్టా యి. ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న సొంత‌గా రాజ‌కీయాలు చేయ‌డం ద్వారా పార్టీ ఏదైనా విజ‌య మే ప‌ర‌మావ ధిగా ఉంటూ వ‌చ్చారు.

 

ఇదే చంద్ర‌బాబుకు త‌ర్వాత కాలంలో తీవ్ర‌మైన దెబ్బ‌కొట్టింది. బాబుతో విభేదించి కొడాలి వైసీపీ తీర్తం పుచ్చుకున్నారు. అయితే, కొడాలి రేంజ్‌లో నాయ‌కుడిని తయారు చేయ డంలోకానీ, పార్టీని నిల‌బెట్టుకోవ‌డంలో కానీ బాబు ప్ర‌య‌త్నం చేయ‌లేక పోయారు. ఒకానొక ద‌శ‌లో రావి వ‌ర్గం ఎదుగుతున్నా.. చంద్ర‌బాబు వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లార‌నే అంటారు సీనియ‌ర్లు. ఇక‌, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో చేసిన పొర‌పాటు అంతా ఇంతా కాదు. స్థానిక నేత‌ల అభిప్రాయం తీసుకో కుండానే, స్థానిక నాయ‌కుల‌ను క‌నుక్కోకుండానే చంద్ర‌బాబు.. స్థానికేత‌రుడైన దేవినేని అవినాష్‌ను రం గం లోకి దింప‌డం. దీంతో టీడీపీ ఓట్లు భారీగా చీలిపోయాయి.

 

చాలా మంది టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల్లో డ్యూయ‌ల్ రోల్ పోషించార‌ని అంటారు. మొత్తంగా చూస్తే.. చంద్ర‌బాబు వ్యూహం విక‌టించి.. మ‌ళ్లీ కొడాలి ఘ‌న విజ‌యం సాధించారు. ఇక‌, ఇప్పుడు ఎవ‌రూ ముందుకు వ‌చ్చి పార్టీ కోసం ప‌నిచేసే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. మొత్తంగా బాబు స్వ‌యంకృతం గుడివాడ‌ను పార్టీకి దూరం చేసింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: