సాఫ్ట్ వేర్ ఉద్యోగం. నిరుద్యోగుల కల ఇది. ఇది నెరవేరాలంటే.. స్పెషలైజేషన్ కోర్సులు చదవాలి. కంప్యూటర్ ప్రోగ్రాములు నేర్వాలి.. కానీ ఇప్పుడు సింపుల్ గా సాధారణ డిగ్రీ ఉన్నా.. టీసీఎస్ కంపెనీలో జాబ్ సంపాదించొచ్చు. ఇందుకు కావాల్సిందల్లా.. టాలెంట్ మాత్రమే.. ఇంగ్లీష్ పరిజ్ఞానం, లాజికల్ థింకింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్ ప్రెటిషన్ పై పట్టు ఉంటే చాలు.

 

ఈ విద్యా సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు పూర్తిచేసుకుంటున్న విద్యార్థులకు టీసీఎస్‌ ఈ ఆఫర్ ఇస్తోంది. ఇందుకోసం జాతీయ అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. టీసీఎస్‌ జాతీయ అర్హత పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. 50 నిమిషాల వ్యవధిలో రాయాలి. వెర్బల్‌ ఎబిలిటీలో 10 ప్రశ్నలు, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌- 4, లాజికల్‌ రీజనింగ్‌- 12, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌- 12, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌- 12 చొప్పున ప్రశ్నలు వస్తాయి.

 

ఇంగ్లీష్ గ్రామర్ లో ప్రాథమిక పరిజ్ఞానం, వాక్యనిర్మాణం పరిశీలించే ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థి తర్కం, విశ్లేషణ నైపుణ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. ఇందులో క్వాలిఫై అయితే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అందులోనూ సక్సస్ అయితే మీ లైఫ్ సెటిల్ అయినట్టే. మే 2020 నుంచి టీసీఎస్‌లో విధుల్లోకి తీసుకుంటారు.

 

ఎంపికైనవారికి కాగ్నిటివ్‌ బిజినెస్‌ ఆపరేషన్స్‌ , బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), లైఫ్‌ సైన్సెస్‌ విభాగాల్లో ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇస్తారు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌: www.tcs.com/ careers చూడొచ్చు. ఇందులో మోడల్ పేపర్ ఉంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: జనవరి 5 పరీక్ష తేదీలు: జనవరి 18, 25 – 2020. త్వరపడండి మరి.

 

అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. 2019-20 విద్యా సంవత్సరంలో రెగ్యులర్‌ విధానంలో బీఏ, బీకాం, బీఎస్సీ ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారే అర్హులు. విద్యాభ్యాసం మొత్తంలో రెండేళ్ల కంటే ఎక్కువ గ్యాప్‌ ఉండకూడదు. పెండింగ్‌ బ్యాక్‌లాగ్స్‌ ఉండకూడదు. 10, 12, డిగ్రీ కోర్సులు తొలి ప్రయత్నంలోనే పూర్తిచేసి ఉండాలి.ఈ కండీషన్లు చెక్ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: