హైదరాబాద్ మెట్రో మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. 2020 జనవరి నెల నుండి మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు నెలవారీ పాసులు లభ్యం కానున్నాయి. జనవరి నెలలో జేబీఎస్ - ఎంజీబీఎస్ స్ట్రెచ్ ప్రారంభోత్సవం జరగనుంది. జేబీఎస్ - ఎంజీబీఎస్ ప్రారంభోత్సవం తరువాత ప్రయాణికులకు మెట్రో పాసులు అందుబాటులోకి రానున్నాయి. 
 
ఎల్ అండ్ టీ మెట్రో రైలు అధికారులు జేబీఎస్ - ఎంజీబీఎస్ ప్రారంభోత్సవం తరువాత ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నెలవారీ పాస్ లను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మెట్రో రైలు అధికారులు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. సాధారణ టిక్కెట్లను కూడా మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికుల కొరకు ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తోంది. 
 
కొన్ని రాష్ట్రాల్లోని మెట్రోల్లో పాసులు అందుబాటులో ఉన్నా హైదరాబాద్ మెట్రోలో మాత్రం పాసులు అందుబాటులోకి తీసుకురాలేదు. మెట్రో రైళ్లలో రోజూ ప్రయాణించే ప్రయాణికులు పాస్ లు, కామన్ కార్డులు ప్రవేశపెట్టాలని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల నుండి నెలవారీ పాసుల గురించి డిమాండ్లు పెరగటం, మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా పెరగటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
2019 సంవత్సరంలో మెట్రో సేవలు హైటెక్ సిటీకి, ఆ తరువాత రాయదుర్గానికి విస్తరించారు. మరోవైపు మెట్రో రైలు ప్రయాణికులకు మెట్రో ఇప్పటికే క్యూఆర్ కోడ్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సమయం వృథా కాకుండా మైక్ మై ట్రిప్ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణించవచ్చని ఒకేసారి ఆరుగురు మేక్ మై ట్రిప్ లో బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని 20 మెట్రో స్టేషన్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొనిరాగా జనవరి నుండి అన్ని స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: