మాములుగా దొంగతనం చేసి జైలుకు వెళ్తే రెండు మూడేళ్లు జైల్లో ఉంటె అక్కడి నుంచి బయటకు రావొచ్చు.  రెండేళ్లు జైలు శిక్షపడితే అందులో వివిధ కారణాల వలన సమయం సగానికి తగ్గిపోతుంది.  చాలా రీజన్లు చెప్పి చివరకు సంవత్సరం ఆరు నెలల్లోనే రిలీజ్ చేసేస్తుంటారు.  అలా హాయిగా బయటకు వచ్చెయ్యొచ్చు.  కొంతమందికి ఇవేమి తెలియకుండా పాపం తప్పించుకొని బయటకు రావడం వచ్చాక మరలా పోలీసులకు దొరికిపోయి డబుల్ సమయం జైలులో గడపడం వంటివి జరుగుతుంటాయి.  


అందుకే ఏ నేరం చేశాం.. ఎలాంటి శిక్ష విధించారు.  ఆ శిక్ష ఎలా విధిస్తారు.  దాని నుంచి ఎలా బయటపడొచ్చు అనే విషయాలను కూలంకుషంగా తెలుసుకోగలిగితే చాలు.  అన్ని అవే సర్దుకుంటాయి.  అన్నింటి నుంచి ఈజీగా బయటపడొచ్చు.  ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అంటారు.  అందుకే వీటి నుంచి బయటపడేందుకు కొన్ని రకాల ప్లానులు చేస్తుంటారు. 1996 వ సంవత్సరంలో ఓ దొంగ దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయాడు. 


అయితే, ఆ దొంగ తీవ్రమైన దొంగతనం చేశారు.  ఇదే అతనికి శాపంగా మారింది.  చేసిన దొంగతనానికి పెద్ద శిక్ష పడింది.  దీంతో జైలుకు పంపారు.  జైలులో రెండేళ్లు ఉన్న ఈ దొంగగారు బెయిలుపై బయటకు వచ్చారు.  అలా బెయిలు మీద బయటకు వచ్చిన ఆ దొంగ, పధకం వేశాడు.  బయటే ఉండిపోవాలని అనుకున్నాడు.  అంతే, అక్కడి నుంచి చెక్కేసి వేరే ప్రాంతానికి వెళ్లి ఓ ముస్లిం మహిళను వివాహం చేసుకొని పేరు మతం మార్చుకున్నాడు.  


ముస్లిం పేరుతోనే ఆధార్, ఇతర కార్డులను కూడా తీసుకున్నారు.  20 ఏళ్లపాటు పోలీసుల కళ్లుగప్పి హ్యాపీగా బయటప్రపంచంలో ఎంజాయ్ చేశాడు.  అయితే, 20 ఏళ్ల నుంచి పోలీసులు ఆ దొంగగారి కోసం గాలిస్తూనే ఉన్నారు.  ఎట్టకేలకు పోలీసులు అతని ఆనవాళ్లు గుర్తుపట్టి దొంగను అరెస్ట్ చేశారు.  అదే బెయిల్ పై బయటకు వచ్చిన సదరు దొంగగారు హ్యాపీగా తిరిగి బెయిల్ పూర్తయ్యాక జైలుకు వెళ్లి ఉంటె... అప్పుడే రిలీజ్ అయ్యేవాడు కదా.  ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటుంది.  అనర్ధాలు తెచ్చిపెడుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: