హమ్మయ్య.. ఈ సంవత్సరం కూడా అయిపోయింది. 2019 కి టాటా చెప్పేకి ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉంది. అన్ని కష్టసుఖాలు మనం ఈ సంవత్సరం చూసేశాము. ఇంకా సెలవలు కూడా దాదాపు అయిపోయాయి. ఒక్క ఆదివారం మాత్రమే మిగిలుంది. ఇంకా ఈ ఆదివారం వెళ్ళాక 2020 సంవత్సరం వచ్చేస్తుంది. సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి సెలవలు ప్రారంభమవుతాయి.
ఇంకా అసలు విషయానికి వస్తే 2020 బ్యాంకుల సేలువలను ఆర్బీఐ ప్రకటించేసింది. మనం తరచూ బ్యాంకులకు వెళ్తున్నట్లైతే ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని మన పనులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ సెలవలు దృష్టిలో పెట్టుకోవాలనే తాజాగా 2020 సంవత్సరంలో ఏఏ రోజుల్లో బ్యాంకులకు అధికారికంగా సెలవులు ఉన్నాయో అనేది ఆర్బీఐ ప్రకటించింది.
అయితే 2020 సంవత్సరంలో బ్యాంకులకు మొత్తం 20 సెలవలు ఉన్నాయి. ఆదివారాలు.. శనివారాలు కాకుండానే బ్యాంకు అధికారులకు 20 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం అంత ఏ ఏ సెలవలు ఎప్పుడు వచ్చాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఆర్బీఐ ప్రకటించిన బ్యాంకు సెలవులు ఇవే..
ఫిబ్రవరి 21- మహాశివరాత్రి,
మార్చి 25- ఉగాది,
ఏప్రిల్ 1- యాన్యువల్ క్లోజింగ్,
ఏప్రిల్ 2- శ్రీరామనవమి,
ఏప్రిల్ 10- గుడ్ ఫ్రైడే,
ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి,
మే 1- మే డే,
మే 25- రంజాన్,
ఆగస్ట్ 1- బక్రీద్,
ఆగస్ట్ 11- శ్రీకృష్ణ జన్మాష్టమి,
ఆగస్ట్ 15- ఇండిపెండెన్స్ డే,
ఆగస్ట్ 22- వినాయక చవితి,
అక్టోబర్ 30- మిలాద్ ఉన్ నబీ,
డిసెంబర్ 25- క్రిస్మస్.
ఈ సెలవులు హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ పరిధిలోని బ్యాంకులకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర రీజనల్ ఆఫీస్లల్లో 2020 సంవత్సరంలో బ్యాంకుల సెలవుల వివరాలు తెలుసుకోవాలంటే ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు. ఏమైతేనేం.. బ్యాంకు అధికారులకు పండగే.. కేవలం పండగ సెలవలె వాళ్లకు 20 రోజులు వచ్చాయి. ఇంకా శనివారాలు, ఆదివారాలు అబ్భవో వీళ్లకు పండగే.. కానీ ప్రజలకే కష్టాలు.