పాకిస్థాన్ కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారత్ లో కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తోందని భారత్ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. జైషే మహ్మద్ నిషేధిత ఉగ్రవాద సంస్థ భారత్ లోని అయోధ్యలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నట్టు భద్రతా అధికారులు గ్రహించారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ భారత్‌లో ఉన్న తమ ఉగ్రవాదులకు టెలిగ్రామ్ యాప్‌ లో పంపించిన సందేశాన్ని భారత నిఘావర్గాలు డీకోడ్ చేశాయి. దీంతో భారత భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యలో అణువణువునా జల్లెడ పట్టి భద్రతా చర్యలు చేపడుతున్నాయి.

 

 

ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్ వర్గాలు కేంద్ర హోంశాఖతో పాటు అన్ని భద్రతా బలగాల విభాగాలకు తెలియజేశాయి. నిత్యం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా అన్ని విభాగాలను హెచ్చరించాయి. నిఘావర్గాల హెచ్చరికలతో భారత్‌లోని జైషే మహమ్మద్ నెట్‌వర్క్‌పై భద్రతా బలగాలు ఓ కన్నేసాయి. అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. అయోధ్యలో రద్దీగా ఉండే అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దశాబ్ధాల తరబడి అపరిష్కృతంగా ఉండిపోయిన అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు ఇటివలే సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో జైషే మహ్మద్ ఈ దాడులకు సిద్ధమవుతోందని సమాచారం.  

 

 

భారత్ పై పాకిస్థాన్ ఎన్నిసార్లు పైచేయి సాధించినా.. చావు దెబ్బ కొట్టినా ఆ దేశ తీరు మారటం లేదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఆ దేశానికి సంబంధించిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు భారత్ పై దాడులకు సిద్ధమవుతున్నారు. శాంతి గురించి పాకిస్థాన్ మాట్లాడటం తప్ప అందుకు చర్యలు ఏమాత్రం తీసుకోవటం లేదనేది భారత్ అనేకసార్లు నిరూపించింది. ప్రపంచ దేశాల మధ్య పాక్ తీరు ఎండగట్టి ఇతర దేశాల మద్దతు దక్కకుండా చేసినా ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో పాక్ విఫలమవుతూనే ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: