ఆళ్ల రామకృష్ణారెడ్డి.. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను మట్టి కరిపించిన నేత. 2014 ఎన్నికల్లోనూ వైసీపీ జండా ఎగరేసిన నాయకుడు. ఆ ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో టీడీపీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నా.. మంగళగిరిలో మాత్రం ఆర్కే నే గెలిచాడు. అంతే కాదు.. ఐదు రూపాయలకు వైఎస్ క్యాంటిన్.. కూరగాయలు వంటి సొంత పథకాలతో జనం మనసు గెలిచాడు.

 

ఆర్కే..  జనంలో మంచి పేరున్న నాయకుడు.. అంతకుమించి జగన్ కు నమ్మిన బంటు. అలాంటి నాయకుడికి జగన్ డబుల్ షాక్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఎలాగంటే.. ఎన్నికల సమయంలో జగన్ ప్రచారం చేస్తూ .. ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగానే మాట ఇచ్చాడు. కానీ ఆ తర్వాత పార్టీ గెలిచినా ఎమ్మెల్యే గా ఆర్కే మిగిలిపోయాడు. వివిధ సామాజిక వర్గ సమీకరణాల రీత్యా ఆర్కేకు జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు. ఇది తొలి షాక్ గా చెప్పుకోవచ్చు.

 

ఆ తర్వాత ఇప్పుడు రాజధాని తరలింపు ద్వారా ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరో షాక్ తగిలినట్టయింది. ఎందుకంటే.. ఇప్పుడు జగన్ నిర్ణయం ద్వారా ఆళ్లకు స్థానికంగా ఎదురు దెబ్బలు తప్పువు,. జనం నుంచి నిరసన తప్పదు. ఇప్పటికే ఆయన కనిపించడం లేదంటూ జనం పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇన్నాళ్లూ వైసీపీ నుంచి దూకుడు గా ఉన్న ఆళ్లకు ఇప్పుడు కాస్త కష్టకాలమే అని చెప్పాలి. ఎప్పుడైతే వైఎస్ జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి చెప్పిన తరువాత నుంచే ఈ విషయంలో రగడ జరగడం మొదలైంది.

 

అమరావతి రైతులు, ప్రజలు రోడ్డుపైకి వచ్చి రాజధానిని అక్కడి నుంచి మార్చవద్దని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు చంద్రబాబు, బీజేపీ మద్దతుగా నిలిచాయి. మూడు రాజధానుల ప్రతిపాదన తరువాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. కొంతమంది రైతులు నిన్నటి రోజున పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. లోకేష్ పై గెలిచినప్పుడు మంత్రి పదవి ఇవ్వకుండా ఇచ్చిన షాక్ కంటే…  కూడా అమరావతి విషయంలో ఇచ్చిన షాక్ ఆళ్ళకు ఇబ్బంది ఇబ్బంది కలిగించేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: