దేశ రాజధాని ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు వ్యవహారం చేరింది. అఖిల భారత హిందూ మహాసభ ఛైర్మన్ చక్రపాణి మహారాజ్ ఏపీలో రాజధాని అమరావతిపై దాడి జరుగుతోందని రాజధాని తరలింపు వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అమిత్ షాను కోరారు. వైసీపీ ప్రభుత్వంపై చక్రపాణి మహారాజ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. చక్రపాణి మహారాజ్ ఏపీలో రాజధాని తరలించడాన్ని అమాయక రైతులపై, హిందూ సంస్కృతిపై జరుగుతున్న దాడి అని అన్నారు. 
 
అమరావతి హిందూ సంస్కృతికి ప్రతీకగా పేరు గాంచిందని రాజధానిని వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉండటంతో హిందుత్వంపై దాడి జరుగుతోందన్న భావన ప్రజలలో ఉందని అన్నారు. అమిత్ షాకు చక్రపాణి మహారాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతమార్పిడులు జరుగుతున్నాయని కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. చక్రపాణి మహారాజ్ ప్రధాని మోదీ ఏపీలో రాజధానికి శంఖుస్థాపన చేశారని అమరావతిని మాత్రమే గత ప్రభుత్వం రాజధానిగా ఎంపిక చేసిందని చెప్పినట్టు సమాచారం. 
 
స్మార్ట్ సిటీగా అమరావతిని ఎంపిక చేశారని కేంద్రం కూడా రాజధాని అభివృద్ధికి నిధులు ఇచ్చిందని చక్రపాణి మహారాజ్ అమిత్ షా కు చెప్పారు. ఏపీలో రాజధాని అమరావతి జగన్ ప్రభుత్వం వ్యక్తిగత విద్వేషాల వలన ఇబ్బందుల పాలవుతోందని చెప్పినట్టు తెలుస్తోంది. చక్రపాణి మహారాజ్ రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని రాజధానిని తరలించటంతో ఏపీ మరింతగా నష్టపోనుందని చెప్పినట్టు తెలుస్తోంది. 
 
ఏపీ రాజధానిగా అమరావతి ఉండేలా జోక్యం చేసుకోవాలని అమరావతి రాజధానిగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని చక్రపాణి మహారాజ్ కోరినట్టు సమాచారం. రాజధాని విషయంలో అమిత్ షా రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి అమిత్ షా రంగంలోకి దిగితే రాజధాని అమరావతి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. మరోవైపు ఈరోజు కేబినేట్ భేటీ తరువాత జగన్ అధికారికంగా రాజధానుల గురించి ప్రకటన చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: