ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు కేబినేట్ భేటీ జరగనుంది. ఈరోజు జరగబోయే కేబినేట్ భేటీలో అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ అందించిన నివేదిక గురించి మరియు ఇతర కీలక విషయాలను చర్చించనున్నారు. ఈరోజు జరగబోయే కేబినేట్ సమావేశంలో దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకానికి సంబంధించిన సవరణలు, 108 మరియు 104 వాహనాల కొనుగోలు గురించి చర్చ జరగనుంది. 
 
ఈరోజు జరగబోయే కేబినేట్ భేటీలో స్థానిక ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్ల గురించి చర్చించనున్నారు. ప్రత్యేక ఎకనామిక్ జోన్ల ఏర్పాటు అంశం కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మంత్రివర్గ ఉపసంఘం కేబినేట్ సమావేశానికి ముందు సీఎం జగన్ తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. సీఎంకు మంత్రివర్గ ఉపసంఘం చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి గురించి ఒక నివేదిక ఇవ్వనుంది. 
 
ఈరోజు ఉదయం 11గంటలకు జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా జీ ఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక గురించి చర్చించి నిర్ణయం తీసుకోవడమే ప్రధాన ఎజెండాగా కేబినేట్ భేటీ జరగనుంది. మరోవైపు 29 గ్రామాల ప్రజలు అమరావతి నుండి రాజధానిని తరలించవద్దంటూ చేస్తున్న పోరాటం ఈరోజుతో పదో రోజుకు చేరింది. 
 
వివిధ పార్టీలు ఇప్పటికే రాజధానిలోని రైతుల ఆందోళనకు తమ మద్దతు ప్రకటించాయి. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినేట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. కేబినేట్ భేటీలో రైతులతో చర్చించటం కొరకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నట్టు సమాచారం. రైతుల నుండి రాజధాని కొరకు సమీకరించిన భూమి గురించి కూడా ఈరోజు స్పష్టత రాబోతుందని సమాచారం. రాజధాని ప్రాంత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని బొత్స సత్యనారాయణ ఇప్పటికే స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: