ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే.కాగా  క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల పై చర్చ జరిగింది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానులు నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాకుండా అమరావతి రైతులందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన బాట పట్టారు అమరావతి మొత్తం రైతులు నిరసన తో హాట్ హాట్ గా ఉంది. ఈ క్రమంలో రాష్ట్రం మొత్తం క్యాబినెట్ లో  మూడు రాజధానిల ప్రకటనపై ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు  అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇకపోతే తాజాగా ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. 

 

 

 ఈ నేపథ్యంలో మూడు రాజధానిల ప్రకటనను  నాని ఏపీ క్యాబినెట్ ఇంకొన్ని రోజులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి నాటికి మూడు రాజధానిల నిర్ణయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్యాబినెట్ లో జరిగిన పలు విషయాల గురించి మంత్రి పేర్ని నాని వివరించారు. అమరావతి తరలింపు పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 30 నిమిషాల పాటు క్యాబినెట్ మొత్తానికి వివరణ ఇచ్చారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన అమరావతిలో రాజధాని అభివృద్ధి జరిగదని సీఎం స్పష్టంగా వివరించారని తెలిపారు. 

 

 

 

అమరావతిలో పెట్టే లక్ష కోట్లలో 10 శాతం విశాఖ లో పెడితే అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుందని జగన్ క్యాబినెట్ మీటింగ్ లో తెలిపారని మంత్రి పేర్ని నాని తెలిపారు. అయితే రాజధాని తరలింపు పై తొందరపాటు ఏమీ లేదని... రాష్ట్ర ప్రజలందరికీ రాజధానిని  ఎందుకు తరలిస్తున్నామో  ఎక్కడికి తరలిస్తున్నామో  పూర్తిగా అర్థం అయ్యేలా చెప్పిన తర్వాతే రాజధానిని తరలిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపినట్లు పేర్కొన్నారు తెలిపారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణం జరుగకముందు  అక్కడ ఎవరెవరు భూములు కొనుగోలు చేశారనే  వాళ్ల పేర్లు  ఉపసంఘం ముఖ్యమంత్రి జగన్ కి నివేదిక అందించారని.. దీనిపై న్యాయవాదులతో చర్చించి అనంతరం సీబీఐ విచారణకు అనుమతి ఇస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: