ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కోరికను జగన్మోహన్ రెడ్డి  తొందరలోనే తీర్చబోతున్నారు. అదేమిటి ఉప్పు-నిప్పు లాగుండే జగన్-చంద్రబాబు మధ్య అంత సఖ్యత ఎప్పుడొచ్చిందని అనుమానిస్తున్నారా ? అదేమి లేదు లేండి. రాజధాని ప్రాంత భూములను చంద్రబాబు అండ్ కో బినామీ పేర్లతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లు జగన్ , వైసిపి నేతలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇపుడా విషయం మీదే సమగ్ర విచారణ జరిపించాలని క్యాబినెట్ సమావేశంలో డిసైడ్ అయ్యింది.

 

ఇదే విషయాన్ని సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని కాస్త వెటకారంగా మాట్లాడుతే వాహిని వారి పెద్ద మనుషుల కోరికలను తీర్చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు సరదాగా చెప్పారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ను అడ్డం పెట్టుకుని టిడిపి పెద్దలు సొంతం చేసుకున్న సుమారు 4070 ఎకరాల వివరాలపై దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

 

పెద్దల భాగోతాలను బయటపెట్టేందుకు లోకాయుక్త లేదా సిబిఐ లేదా సిఐడి ల్లో ఏదో ఒక దానితో విచారణ చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.  చూడబోతే సిబిఐతోనే విచారణ చేయించేట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పై సంస్ధల్లో దేనితో విచారణ జరిపించే అవకాశం ఉంటే దానితోనే చేయిస్తారన్న విషయం తెలిసిందే.

 

ఇక ఇన్ సైడర్ ట్రేడిండ్ ఆరోపణలపై చంద్రబాబు, చినబాబు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు లాంటి వాళ్ళు చాలామంది విచారణ జరిపించమని ప్రభుత్వాన్ని ఎప్పటి నుండో పదే పదే డిమాండ్ చేస్తున్నారు.

 

మొన్ననే ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబు అండ్ కో లో ఎవరెవరికి ఎంతెంత భూములున్నాయో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి సవివరంగా అసెంబ్లీలోనే వివరించిన విషయం అందరూ చూసిందే.  కాబట్టి చంద్రబాబు అండ్ కో డిమాండ్ చేస్తున్నట్లే జగన్ ప్రభుత్వం విచారణకు రెడీ అవుతున్నది. మరి విచారణలో ఎటువంటి వివరాలు బయటపడతాయో చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: