ఓపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అంశం తీవ్ర దుమారం రేపుతోంది. రాజధానిపై తన నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసినా అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తలు చల్లారలేదు. ఇందుకు ముఖ్య కారణం ప్రభుత్వం మూడు రాజధానులపైనే ముందుకెళ్లే అవకాశం ఉందని అనుమానాలు ఉండడమే. ఈ అంశంలో ప్రభుత్వం, ప్రతిపక్షం, అమరావతి ప్రాంత రైతులు తమ తమ వాదనలతో నలిగిపోతుంటే సందట్లో సడేమియా అంటూ రాజధానిపై తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

 

 

తన సినీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాజధానిపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పలు వ్యాఖ్యలు చేశాడు.  నా దృష్టిలో రాజధాని అన్న పదానికే అర్ధంలేదు. ఏ అర్ధం లేనప్పుడు అనకాపల్లిలో ఉంటే ఎంటి?.. చెన్నైలో ఉంటే ఏంటి? రాజధాని అంటే మెయిన్ థియేటర్ లాంటిది. ప్రజలకు నేరుగా పాలన అందాలనుకుంటే ప్రతి టౌన్‍కి ఒక క్యాపిటల్ ఉండాలి అంటూ రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్లో వ్యాఖ్యానించాడు. అసలే రామ్ గోపాల్ వర్మకి తిక్క. ఈ తిక్కలో అసలే రగిలిపోతున్న రైతులకు మరింత ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యానించాడు. ఆర్జీవి మాటలు వింటే భూములు ఇచ్చినోళ్లకు తెలుస్తుంది బాధ.. సినిమాలు చేసుకునే నీకేం తెలుసు అని రైతులు చేత తిట్టించుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్టుంది.

 

 

తమ అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉన్నా ఆ అభిప్రాయం ఏదో ఒకవైపు ఉంటే ఇబ్బంది లేదు. కానీ.. ఆర్జీవి ఇలా అటూ ఇటూ కాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరో కమిటీ నివేదిక వచ్చే వరకూ వేచి చూస్తామని ప్రభుత్వం చెప్పినా అమరావతి రైతులు శాంతించలేదు. సంక్రాంతి తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిపై ప్రభుత్వం విష్పష్ట ప్రకటన చేసే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. మరి వర్మ వ్యాఖ్యలపై రైతులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: