ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన  3 రాజధానిల  అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా జగన్ ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయంపైనే చర్చ జరుగుతోంది. అయితే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో మూడు రాజధానిల  పై క్లారిటీ వస్తుందని అందరూ ఊహించారు కానీ మూడు రాజధానిల  పై నిర్ణయం మళ్ళీ వాయిదా పడింది. ఇకపోతే రాజధాని అమరావతిలో పరిస్థితి రోజురోజుకు ఉద్రిక్తంగా మారింది. రైతులు ఆందోళనలు ధర్నాలు నిరసనలతో రాజధాని ప్రాంతం మొత్తం అట్టుడుకుతోంది.దీంతో  పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం హాట్ హాట్ గా మారిపోయింది. 

 

 

 

 ఇకపోతే నిన్న క్యాబినెట్ మీటింగ్ అనంతరం అమరావతిలో అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని అందులో పదిశాతం విశాఖలో ఖర్చుపెడితే విశాఖ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుంది అంటూ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో తెలిపిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా రాజధాని మార్పు గురించి తెలిపిన తర్వాతే రాజధాని మార్పు ఉంటుందని క్యాబినెట్ మీటింగ్ లో స్పష్టం చేశారని మంత్రి పేర్ని నాని తెలిపారు. అయితే తాజాగా జగన్ ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేయగలమా అనేది రాజధాని చర్చలో ప్రధాన అంశమని ఆయన తెలిపారు. 33 వేల ఎకరాల్లో ప్రభుత్వం చేతికి వచ్చే పది వేల ఎకరాలకు విలువ రావాలన్నా.. ముందుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది అంటూ ఆయన పేర్కొన్నారు. 

 

 

 లక్ష కోట్ల పెట్టుబడులను ఒకేచోట పెట్టడం సాధ్యమయ్యే పని కాదని ఆయన తెలిపారు. ఇదే సమయంలో రాజధాని విశాఖ అంశాన్ని కూడా సమర్థిస్తూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో రాజధాని ఏర్పడితే వెయ్యి కోట్లతో రాజధానికి కావాల్సిన భవనాలను నిర్మించుకొని మరో 10 వేల కోట్లను ఒక ప్రణాళిక ప్రకారం విశాఖ లో ఖర్చు  పెడితే విశాఖను దేశంలోనే కాదు ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దె  అవకాశాలు ఉన్నాయంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: