వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు.  ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అందరి వాడుగా అందరి సీఎంగా పేరు తెచ్చుకుంటున్నాడు జగన్.  జగన్ ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చుకుంటూ వచ్చారు.  ఇంకా కొన్ని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నారు.  అయితే, అన్నింటికంటే ముఖ్యంగా తన పాదయాత్ర సమయంలో ఆర్టీసీ కార్మికులు తమ బాధల గురించి, తమ ఉద్యోగాల భవిష్యత్తు గురించి జగన్ ను అడిగారు.  

 


జగన్ పాదయాత్ర సమయంలో నేనున్నాను అని భరోసా ఇచ్చారు.  భరోసా ఇచ్చినట్టుగానే జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు.  ఆ తరువాత దానికి సంబంధించిన కమిటీ వేశారు.  అసెంబ్లీ ఆర్టీసీని విలీనం చేస్తున్నట్టుగా బిల్లును ప్రవేశపెట్టి ఉభయ సభల్లో ఆమోదం పొందేలా చూశారు.  ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అంశం కాబట్టి ప్రతిపక్షం కూడా ఆమోదించింది.  ఉభయసభలు ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్దకు వెళ్ళింది.

 

 గవర్నర్ కూడా ఆ బిల్లుకు ఆమోదం తెలుపుతూ రాజముద్ర వేశారు.  దీంతో బిల్లుకు చట్టబద్దత కలిగింది.  గజెట్ నోటిఫికేషన్ లో దీనిని పెట్టబోతున్నది ప్రభుత్వం.  గెజిట్ నోఫిటికేషన్ పెట్టిన తరువాత ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారు.  ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయిన తరువాత అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి.  


అంతా హ్యాపీనే కదా. ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో సంబరాలు చేసుకుంటున్నారు.  ఇకపై ఎలాంటి టెన్షన్ ఉండదని, ఆర్టీసీ కార్మికులు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఉద్యోగానికి భరోసా ఉంటుందని అంటున్నారు.  జగన్ తమకు దేవుడితో సమానం అని చెప్తున్నారు ఆర్టీసీ కార్మికులు.  మరి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు ఆర్టీసీ అభివృద్ధికి ఎంతమేర సహకరిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: