ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసింది.  దీంతో దేశంలో పెద్ద ఎత్తున అలజడి మొదలైన సంగతి తెలిసిందే.  ఈ రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ లో కొన్ని రోజులు అలజడులు జరిగాయి.  కాగా, ఇప్పుడు అక్కడ శాంతియుత వాతావరణం నెలకొన్నది.  ఈ శాంతియుత వాతావరణంలో అన్ని రకాల సమస్యలు దాదాపుగా సమసిపోయాయి.  కేంద్రం తమ బలగాలను కూడా ఉపసంహరించుకుంది.  


దీని తరువాత బాబ్రీమసీద్, తరువాత పౌరసత్వం చట్టం తీసుకొచ్చింది.  ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున రగడ జరుగుతున్నది.  పౌరసత్వం చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.  కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఈ చట్టాన్ని అమలు చేయడానికి పెద్దగా అంగీకరించడం లేదు.  కానీ, కేంద్రం మాత్రం వెనకడుగు వేయడం లేదు.  ఎలాగైనా సరే అమలు చేసి తీరుతామని అంటోంది.  


ఇకపోతే, ఈ చట్టం ఇలా వివాదాస్పదం అవుతున్న సమయంలోనే జాతీయ గణన ను మొదలుపెట్టేందుకు సిద్ధం అయ్యింది.  వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గణన చేస్తుంది.  దీనికి పెద్దగా ప్రశ్నలు అడగబోరని అంటున్నా... దీనికోసం మొత్తం 34 ప్రశ్నలు సిద్ధం చేసింది కేంద్రం.  యజమాని కుటుంబం గురించి పూర్తి వివరాలను నోట్ చేసుకోబోతున్నారు.  


ఇలా పూర్తి వివరాలను నోట్ చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది అన్నది కేంద్రం ఆలోచన.  ఇంట్లో ఉండే సభ్యుల నుంచి వాడే మొబైల్ నెంబర్ గ్యాస్, వాహనాలు, ఇతర వివరాలతో కూడిన ప్రశ్నలు ఆగబోతున్నది.  ఎన్ని బెడ్ రూమ్ లు ఉన్నాయి.  ఎన్ని బాత్ రూమ్ లు ఉన్నాయి.  మరుగుదొడ్డి ఉన్నదా లేదా ఎన్ని బ్యాంక్ లలో ఎకౌంట్స్ ఉన్నాయి అనే విషయాలు కూడా తెలుసుకోబోతున్నది కేంద్రం.  అవసరం ఏంటి అంటే అవసరమే అంటోంది. అయితే, ఈ ఎన్ పీఆర్ ను కూడా కొన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: