ఇటీవల కాలంలో ప్రపంచంలో, దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి.  ఎంతగా ఆపేందుకు ప్రయత్నం చేసినా కుదరడం లేదు.  ప్రతి నిమిషం ఎక్కడో ఒకచోట అత్యాచారం జరుగుతూనే ఉన్నది.  మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, చిన్న పిల్లలను సైతం కామాంధులు వదలడం లేదు.  

 


తమిళనాడులోని కోయంబత్తూరులో మార్చి 31 వ తేదీన తొండాముత్తూరు ప్రాంతానికి చెందిన ఓ ఏడేళ్ల బాలికపై కామాంధుడు అత్యాచారం చేసి హత్య చేశాడు.  హత్య చేసిన తరువాత ఆ చిన్నారిని ఓ టీ షర్ట్ లో చుట్టి దూరంగా ఉండే ముళ్లపొదల్లో పడేశాడు.  చిన్నారి కనిపించడం లేదని వెతుకుతున్న సమయంలో ముళ్లపొదల నుంచి వాసన రావడంతో చూడగా చిన్నారి శవం కుళ్ళిన స్థితిలో కనిపించింది.  

 


వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు.  ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని నిందితుడిని పట్టుకున్నారు.  అయితే, అలా పట్టుకున్న నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  ఈ కేసును విచారించిన కోర్టు సదరు నిందితుడికి ఉరిశిక్ష విధించింది.  మైనర్ బాలికలను రేప్ చేస్తే ఫోక్సో చట్టం ప్రకారం కఠినంగా  శిక్షించేందుకు కోర్టుకు అధికారం ఉన్నది.  దీంతో కోర్టు సదరు నిందితుడికి ఉరిశిక్ష విధించింది.  

 


పెళ్ళైన నెల రోజులకే నిందితుడి భార్య అతడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది.  అప్పటి నుంచి నిందితుడు తన అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు.  అలా అమ్మమ్మ వద్ద ఉంటున్న ఈ నిందితుడు ఇంటికి కొద్దిరూరంలో ఏడేళ్ల చిన్నారి ఉంటోంది.  ఆ చిన్నారిపై కన్నేసిన నిందితుడు మార్చి 31 వ తేదీన మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు.  ఆపై హత్యచేశాడు.  క్షణికావేశంలో చేసిన ఆ పని వలన రెండు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: