ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం రాష్ట్రంలో మూడు రాజధాని ఏర్పడే అవకాశం ఉందని తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై మొన్నటివరకు ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 3 రాజధానిల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసాయి. అమరావతిలో కూడా రైతులు అందరూ నిరసన బాట పట్టారు. ఇకపోతే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతలందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల  నిర్ణయం కంటే ఎక్కువగా వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖకు రాబోతున్నారు అంటూ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం టిడిపి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

 


 ఇకపోతే నిన్న క్యాబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని వైసీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అది ఆయన  వ్యక్తిగత వ్యాఖ్యలు అంటూ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనా లేక విజయ్ సాయి రెడ్డ  అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నలు వేస్తున్నాయి. ఇక తాజాగా వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. తప్పుడు పనులు చేసి 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి తన తిడుతున్నాడు అంటూ విజయసాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు టీడీపీ నేత దేవినేని ఉమ. 

 


 బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ లో కీలక వ్యక్తి అయిన అల్లుడు స్నేహితుడని ఆయనతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని రాజధాని పై నివేదిక ఇచ్చే పని వారికి అప్పగించారు అంటూ టిడిపి నేత దేవినేని ఉమ ఆరోపించారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతిని మారుస్తామని చెప్పలేదు అలాంటప్పుడు... మేనిఫెస్టోలో  చెప్పకుండా రాష్ట్ర రాజధాని మార్చే అధికారం సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారని ప్రశ్నించారు దేవినేని ఉమా. విశాఖలో కలెక్టర్ కమిషనర్ పక్కన కూర్చొని విశాఖను  రాజధానిగా ప్రకటించి అధికారాన్ని అసలు విజయసాయి రెడ్డి కి ఎవరు ఇచ్చారు అంటూ మండిపడ్డారు. విజయసాయి రెడ్డి పై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: