నిన్న ఏపీ క్యాబినెట్ మీటింగ్ అనంతరం... ప్రతిపక్ష పార్టీ నేతలపై అవినీతి నివేదిక అందించాలని.. అమరావతి లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి త్వరలో సిబిఐ విచారణ జరుగుతుంది అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపి పాలనలో అమరావతి ప్రాంతంలో 1170 ఎకరాల రిజిస్ట్రేషన్లు జరిగాయని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తెలిపారు. 4075 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసిపి పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు బుద్ధ వెంకన్న. ఈ ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలిపారు.

 

 

 ఏం పీక్కుంటావో పీక్కొంది అంటూ  తమ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు అంటూ బుద్ధ వెంకన్న తెలిపారు. అధికారంలో ఉన్నది వైసిపి పార్టీ నేనని విచారణ చేసుకోవాల్సింది కూడా మీరే అంటూ బుద్ధ వెంకన్న విమర్శలు చేశారు. ఏడు నెలల పాలనలో  మీరు పీకింది ఏమీ లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు బుద్ధ వెంకన్న. చంద్రబాబు తనపై తానే సీబీఐ విచారణ చేయించుకోవాలని ఎందుకు  మాట్లాడుతున్నారు   విజయసాయి రెడ్డి గారు అంటూ ఎద్దేవా చేశారు. సిబిఐ పై మీకున్న అమితమైన ప్రేమ కు ధన్యవాదాలు అంటూ బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అని ఇంకా మీరు నమ్మలేకపోతున్నారా విజయసాయి రెడ్డి గారు అని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న సెటైర్ వేశారు. 

 


 సిబిఐ విచారణపై ఎంతో నమ్మకంతో ఉన్న మీరు, జగన్ గారు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా ఎందుకు తప్పించుకుంటున్నారు అంటూ బుద్ధా వెంకన్న నిలదీశారు. విచారణను త్వరగా పూర్తి  చేయాలని జగన్ తో లేఖ రాయించాలని అంటూ ఎద్దేవా  చేశారు బుద్ధ వెంకన్న. క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఆంధ్ర రాజకీయాలు మరింత హాట్ గా మారిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మంత్రివర్గ ఉప సంఘం జగన్ కు అవినీతి  నివేదిక అందించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయవాదులను సంప్రదించాక అమరావతి లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి సిబిఐ విచారణ జరుపుతామని తెలిపారు వైసీపీ మంత్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి: