తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హరీష్ రావు సంగారెడ్డి జిల్లా కందిలోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హరీష్ రావు విద్యార్థులు కనీసం ఎక్కాలు కూడా చెప్పకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇలా చదివితే ప్రపంచంతో ఎలా పోటీ పడతారని హరీష్ రావు ప్రశ్నించారు. 
 
విద్యార్థులలో కొందరు తెలుగులో పేర్లను కూడా సరిగ్గా రాయలేకపోవటంతో టీచర్లపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచటానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. పిల్లల చదువులు ఇలా ఉంటే పిల్లలు ఎలా పాసవుతారని హరీష్ రావు టీచర్లను ప్రశ్నించారు. హరీష్ రావు టీచర్ గా మారి పిల్లలకు బోధించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విద్యార్థులను మంత్రి అభినందించారు. 
 
విద్యార్థులను మధ్యాహ్న భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకొని మధ్యాహ్న భోజనం నాణ్యతను మంత్రి పరిశీలించారు. భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా..? లేదా..? అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ఒక సమావేశానికి హాజరైన హరీష్ రావు సోషల్ మీడియాకు పిల్లలు బానిసలు కాకుండా చూడాలని హరీష్ రావు అన్నారు. విద్య అంటే మార్కులు, ర్యాంకులు మాత్రమే అని భావించవద్దని అన్నారు. 
 
పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ల మైండ్ సెట్ కూడా అదే విధంగా పని చేస్తుందని అన్నారు. పిల్లలు రూల్స్ పాటించాలని పద్దతులు పాటించాలి అనే విధంగా వారిని తయారు చేయాలని హరీష్ రావు అన్నారు. ప్లాస్టిక్ రహిత తెలంగాణ కోసం కృషి చేస్తున్నామని దీనిలో పిల్లలను కూడా భాగస్వామ్యం చేయాలని అన్నారు. చిన్నప్పటినుండే పిల్లలను మొక్కలు పెంచే విషయంలో మొక్కలు కాపాడే విషయంలో వాళ్ల యొక్క బాధ్యతను వాళ్లకు నేర్పిస్తూ ఉండాలని అన్నారు. తప్పకుండా ప్రతి పిల్లవాడు మొక్కలు పెంచాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: