తిరుమల వెంకన్న.. కోట్లాది మంది తెలుగువారికి ప్రత్యక్ష దైవం. తెలుగువారికే కాదు.. దక్షిణ భారతీయదేశంలోనూ.. ఆ మాట కోస్తే భారత దేశమంతా ఆయన భక్తులు ఉన్నారు. కానీ. కొందరు పనిగట్టుకుని తిరుపతి వెంకన్నపై దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే ఇలాంటి ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని టీటీడీ భావించింది.

 

అందుకే.. సైబర్‌ సెక్యూరిటీ విభాగాన్ని పూర్తిస్థాయిలో తిరుపతిలో, తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి సపరేట్‌ అధికారిని నియమించాలని కూడా పాలక మండలి డిసైడ్ చేసింది. సోషల్‌మీడియా సైబర్‌సెక్యూరిటీ వింగ్‌ కంట్రోల్‌ చేయలేకపోతే దుష్ప్రచారానికి అడ్డూ అదుపు లేకుండా పోతుందని మండలి భావించింది.

 

గతంలో జరిగిన కొన్ని దుష్ప్రచారాల దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరన్నా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే, పేపర్లలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే ఎలా కంట్రోల్ చేయాలి, అలా చేసిన వారిని వెంటనే ఎలా గుర్తించాలి, వారిపై ఎలా చర్యలు తీసుకోవాలి అన్న చర్చ జరిగింది.

 

వీటన్నిటినీ సైబర్ వింగ్ పెట్టి దానికి ఒక హెడ్ గా ఒక డిఎస్పీ స్థాయి అధికారిని అపాయింట్ చేసి, ఆయన కూడా టెక్నాలజీవైజ్ సపోర్టు కోసం ఇన్ఫోటెక్, టీసీఎస్ నుంచి అడ్వైజులు తీసుకుని ఈ డిపార్టుమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 

అంతే కాదు.. గతంలో ఓ పత్రిక ఏసయ్య అంటూ టీటీడీపై చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన వార్తా ప్రచురణపై పరువు నష్టం దావా వేయాలని కూడా నిర్ణయించారు. కోర్టులో కేసు వేయాలని బోర్డు తీర్మానం చేసింది. వాళ్లు ఎవరైనా మనను వ్యక్తిగతంగా దూషిస్తే పర్వాలేదు కానీ వాళ్లు సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామిపైనే నింద మోపే విధంగా వారు పబ్లిష్ చేసారు కనుక వారిపై 100 కోట్లకుపైగా వాళ్లపై డిఫ్లమేషన్ కేసు వేయాలని చెప్పి బోర్డు నిర్ణయం తీసుకుని బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బోర్డు సభ్యులు కొందరు 1000 కోట్లకు కేసు వేసినా తప్పులేదంటున్నారుని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: