పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ తొత్తులా అంజనీకుమార్ వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్ ర్యాలీలకు అనుమతించకపోవడంతో పోలీస్ కమిషనర్ పై ఉత్తమ్ మండిపడ్డారు. సత్యాగ్రహ దీక్ష పార్టీ కార్యాలయంలో చేస్తే వేల మంది పోలీసులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
గవర్నర్ కు సీపీ అంజనీ కుమార్ పై ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ అన్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే కూడా అరెస్ట్ చేస్తారా...? అని ఉత్తమ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి నిరాకరించిన అంజనీ కుమార్ ఆర్.ఎస్.ఎస్ కవాతుకు మాత్రం అనుమతి ఇచ్చారని అన్నారు. గవర్నర్ ముందు అంజనీ కుమార్ ఎక్కడ ఏం చేశాడో ఆ చిట్టా అంతా ఉంచుతామని అన్నారు. పొగరుబోతుతనం, అహంకారంతో అంజనీ కుమార్ వ్యవహరించారని అన్నారు. 
 
ఐపీఎస్ బదులు అంజనీ కుమార్ కేపీఎస్ అని పెట్టుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా వెళతామని చెప్పినా అనుమతి ఇవ్వలేదని ఎక్కడినుండో వచ్చావ్... ఉద్యోగం చూసుకొని వెళ్లిపో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అంజనీ కుమార్ కు క్యారక్టర్ లేదని అంజనీకుమార్ అవినీతిలో కూరుకుపోయాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 
 
సెక్షన్ 8 ప్రకారం అంజనీకుమార్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ హెచ్చరించారు. ఓవరాక్షన్ చేస్తే అంతు చూస్తామని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ ఒక్క నిరుద్యోగికయినా నిరుద్యోగ భృతి ఇచ్చారా...? ఒక్క రైతుకు అయినా రుణమాఫీ చేశారా...? అని ప్రశ్నించారు. భారీ మెజార్టీతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని అన్నారు. టీఆర్ ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ఎన్నికలకు భయపడుతోందని చిల్లరగా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అవమానపరిచేలా అంజనీకుమార్ వ్యవహరించాడంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: